దేశీ దిగ్గజ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా SBI ఎన్నో రకాల సేవలని తమ కస్టమర్స్ కి అందిస్తోంది. వీటి వలన కస్టమర్స్ కి ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. ఇది ఇలా ఉంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా SBI కస్టమర్స్ కి గుడ్ న్యూస్ ని చెబుతోంది. దీనితో రుణ గ్రహీతలకు ఊరట కలుగుతుంది అనే చెప్పాలి. ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే..
SBI తాజాగా రుణ గ్రహీతలకు ఊరట కలిగించే ప్రకటన చేసింది. లోన్ తీసుకునే వారికి స్పెషల్ ఆఫర్ అందుబాటులోకి స్టేట్ బ్యాంక్ తీసుకు రావడం జరిగింది. అదే విధంగా ఫెస్టివల్ లోన్ ఆఫర్లు కూడా ఎస్బీఐ తీసుకు వచ్చింది. అయితే ఏ లోన్స్ మీద ఇది పని చేస్తుంది అనేది చూస్తే..
ఎస్‌బీఐ పర్సనల్ లోన్, కార్ లోన్, గోల్డ్ లోన్ తీసుకునే వారికి బెనిఫిట్స్ అందిస్తోంది. ఈ రుణాలపై ప్రాసెసింగ్ ఫీజు మాఫీ చేస్తున్నట్లు వెల్లడించింది. అలానే బంగారంపై రుణాలు పొందే వారికి, వ్యక్తిగత రుణాలు తీసుకునే వారికి, కారు కొనుగోలుకు లోన్ తీసుకునే వారికి ప్రాసెసింగ్ ఫీజు ఉండదు. అలానే కారు లోన్ ఈఎంఐ రూ.లక్షకు రూ.1539 నుంచి స్టార్ట్ అవ్వగా… పర్సనల్ లోన్ తీసుకుంటే రూ.లక్షకు ఈఎంఐ రూ.1832 నుంచి స్టార్ట్ అవుతోంది. బంగారంపై లోన్ తీసుకుంటే.. అప్పుడు రూ.లక్షకు ఈఎంఐ రూ.3111 నుంచి మొదలు అవుతుంది.