స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాతాదారులకు శుభవార్త. ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీని బ్యాంకు కల్పించింది. అంటే మీ అకౌంట్‌లో డబ్బులు లేకపోయినా కూడా డబ్బులు విత్‌డ్రా చేసుకోవచ్చు. అందరికీ ఈ బెనిఫిట్ అందుబాటులో ఉండకపోవచ్చు. వీటికి కొన్ని నియమ నిబంధనలు వర్తిస్తాయి. అయితే మీకు అవకాశం ఉందో? లేదో? ఒసారి చెక్ చేసుకొండి.
దేశీయ అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన వినియోగదారులకు ఎన్నో రకాల సేవలు అందిస్తోంది. వీటిల్లో ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ కూడా ఒకటి. ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ కలిగి ఉండటం వల్ల మీ అకౌంట్‌లో డబ్బులు లేకపోయినా కూడా విత్‌డ్రా చేసుకునే వెసులుబాటును స్టేట్ బ్యాంక్ కల్పిస్తోంది.
కాకపోతే ఈ ఎస్‌బీఐ ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ అనేది అందరికీ అందుబాటులో ఉండదు. కేవలం ఎంపిక చేసిన వినియోగదారులకు మాత్రమే వర్తిస్తుంది. బ్యాంక్ కొంత మంది వినియోగదారులకు ప్రిప్రూవ్డ్ ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ అందిస్తుంది. కొంత మంది దీని కోసం అప్లై చేసుకోవలసి ఉంటుంది. ఆ తర్వాతనే ఈ బెనిఫిట్ పొందడానికి వీలవుతుంది.
బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్లు, షేర్లు, ప్రాపర్టీ, ఇన్సూరె పాలసీ, బాండ్లు వంటి వాటిని తనఖా పెట్టి ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ పొందవచ్చు. శాలరీ అకౌంట్‌పై కూడా ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ పొందవచ్చు. అలాగే బంగారంపై కూడా ఓడీ ఫెసిలిటీ లభిస్తుంది.
ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ లభిస్తే.. దీనికి ఒక లిమిట్ ఉంటుంది. ఈ లిమిట్ లోపు మీరు డబ్బులు ఉపయోగించుకోవచ్చు. ఎంత ఉపయోగించుకుంటే.. అంత మొత్తానికే వడ్డీ చెల్లిస్తే సరిపోతుంది. మీ వద్ద డబ్బులు ఉన్నప్పుడు ఓవర్ డ్రాఫ్ట్‌ను క్లోజ్ చేసుకుంటే సరిపోతుంది. అంతే డబ్బు అవసరమున్నవారు ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోండి. సరైన సమయంలోనే డబ్బును బ్యాంక్‌కు కట్టాలి. మళ్లీ ఓడీ డబ్బు తీసుకునే అవకాశం లభిస్తుంది.