ఎస్‌బీఐ సూపర్ స్కీమ్..ఒక్కసారి చేరితే రూ.15 లక్షలు మీ సొంతం..

-

దేశంలోనే అతి పెద్ద బ్యాంకు అయిన ఎస్బిఐ కస్టమర్లకు ఎన్నో రకాల సేవలను అందిస్తుంది.. తక్కువ వడ్డీకే రుణాలను కూడా అందిస్తుంది.. వీటిలో ఫిక్స్డ్ డిపాజిట్ లు కూడా ఉన్నాయి.. ఏడాది నుంచి పదేళ్ల వరకు టెన్యూర్‌తో ఎఫ్‌డీ సేవలు అందుబాటులో ఉంచింది. మీకు నచ్చిన టెన్యూర్ ఎంచుకొని డబ్బులు దాచుకోవచ్చు. మీరు ఎంచుకునే కాల పరిమితి ఆధారంగా మీకు వచ్చే రాబడి కూడా మారుతుంది.. ఎందుకంటే టెన్యూర్ ప్రాతిపదికన వడ్డీ రేటు కూడా మారుతుంది. అలాగే రెగ్యులర్ కస్టమర్లకు, సీనియర్ సిటిజన్స్‌కు కూడా వడ్డీ రేటు మార్పు ఉంటుంది. సీనియర్ సిటిజన్స్‌కు సాధారణంగా అధిక వడ్డీ వస్తుంది…

ఇక ఇందులో ఏడాది ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 6.8 శాతం వడ్డీ రేటు అందిస్తోంది. రెగ్యులర్ కస్టమర్లకు ఇది వర్తిస్తుంది. అద సీనియర్ సిటిజన్స్‌కు అయితే 7.3 శాతం వడ్డీ లభిస్తుంది. అంటే మీరు ఈ స్కీమ్‌లో రూ. లక్ష ఇన్వెస్ట్ చేస్తే.. మీకు రూ. 7500 వరకు వస్తాయి.. రెండేళ్ల టెన్యూర్‌ ఎంచుకుంటే మాత్రం.. మీకు 7 శాతం వడ్డీ రేటు వస్తుంది. రెగ్యులర్ కస్టమర్లకు ఇది వర్తిస్తుంది. అదే సీనియర్ సిటిజన్స్‌కు అయితే 7.5 శాతం వడ్డీ వస్తుంది. అంటే మీకు రెండేళ్ల కాలంలో రూ. లక్ష ఇన్వెస్ట్‌మెంట్‌పై రూ. 16 వేల వరకు వడ్డీ వస్తుంది..

అదే విధంగా మూడేళ్ల ఫిక్స్‌డ్ డిపాజిట్ల విషయానికి వస్తే.. రెగ్యులర్ కస్టమర్లకు 6.5 శాతం వడ్డీ వస్తోంది. సీనియర్ సిటిజన్స్‌కు అయితే 7 శాతం వడ్డీ రేటు ఉంది. అంటే రూ. లక్ష ఇన్వెస్ట్‌మెంట్‌పై రూ. 23 వేల వరకు వడ్డీ వస్తుంది.. ఇక నాలుగేళ్లు తీసుకుంటే వడ్డీ రేటు 6.5 శాతం నుంచి ప్రారంభం అవుతోంది. సీనియర్ సిటిజన్స్‌కు అయితే 7 శాతం వడ్డీ వస్తుంది. అంటే మీరు రూ. లక్ష ఇన్వెస్ట్ చేస్తే.. మీకు వడ్డీ రూపంలోరూ. 32 వేల వరకు వస్తుంది.. ఐదేళ్లకు సీనియర్ సిటిజన్స్‌కు అయితే 7.5 శాతం వడ్డీ ఉంది. అంటే రూ. 10 లక్షలు డిపాజిట్ చేస్తే.. మెచ్యూరిటీ సమయంలో దాదాపు రూ. 15 లక్షలు వస్తాయని చెప్పుకోవచ్చు.. ఇక స్పెషల్ స్కీమ్ లు కూడా ఉన్నాయి..వాటిలో ఇన్వెస్ట్ చేసిన కూడా మంచి బెనిఫిట్స్ ఉన్నాయి..

Read more RELATED
Recommended to you

Latest news