స్కూల్ పేరు చెప్పి.. ఫేస్ బుక్ ఫ్రెండ్ దగ్గరికి బాలిక జంప్ !

-

రాజస్థాన్ లోని కోట ప్రాంతానికి చెందిన 15 ఏళ్ల అమ్మాయి ఎప్పటిలాగే ఉదయాన్నే లేచి రెడీ అయ్యింది.బ్యాగు పట్టుకుని స్కూల్ కి వెళ్తున్నాను అంటూ ఇంట్లో నుంచి బయలుదేరింది.అయితే సాయంత్రం అయినా ఆమె ఇంటికి తిరిగి రాలేదు.దీంతో కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేశారు.ఆ టీనేజర్స్ కోసంం స్కూల్ లో ఎంక్వయిరీ చేశారు.ఈ క్రమంలో ఆమె అసలు స్కూల్ కే రాలేదని సమాచారం రావడంతో కంగు తిన్నారు.వెంటనే ఆ యువతి ఆచూకీ కోసం గాలింపు చర్యలు ప్రారంభించారు.కానీ వారి శ్రమ వృధా అయ్యింది.దీంతో పోలీసులను ఆశ్రయించారు.ఈ నేపథ్యంలో షాకింగ్ నిజాలు బయటపడ్డాయి.

స్కూల్ కి వెళ్తున్నానని బయలుదేరిన ఆ యువతి తిన్నగా తనకు ఫేస్ బుక్ లో పరిచయమైన ఫ్రెండ్ లో కలిసేందుకు మధ్యప్రదేశ్ లోని గ్వాలియార్ కు వెళ్ళింది.అయితే సాయంత్రం అయినా స్కూల్ నుండి అమ్మాయి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు కంగారుపడ్డారు.ఆమె కోసం గాలించి, పోలీసులకు ఫిర్యాదు చేశారు.దీంతో రంగంలోకి దిగిన పోలీసులు..ఫేస్బుక్ ఫ్రెండ్ ను కలిసేందుకు ఆమె గ్వాలియార్ కు వెళ్లినట్లు గుర్తించారు.అనంతరం ఆమెను గ్వాలియార్ నుంచి రాజస్థాన్ తీసుకువచ్చారు.బస్సు టికెట్ కి డబ్బులు లేనప్పటికీ ఆ ఫేస్బుక్ ఫ్రెండ్ సహాయంతోనే ఆమె గ్వాలియార్ వెళ్ళినట్టు పోలీసుల విచారణలో ఆమె వెల్లడించింది.అంతేకాకుండా తన ఫ్రెండ్ కుటుంబ సభ్యులతో సరదాగా గడిపినసరదాగా గడిపినట్టు పేర్కొంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version