అమరావతి : ఏపీ ఉద్యోగులకు సిఎం జగన్ శుభవార్త చెప్పారు. జూన్ లో సాధారణ బదిలీలకు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆమోద ముద్ర వేశారు. ముఖ్యమంత్రి జగన్‌తో ప్రభుత్వ ఉద్యోగ ఫెడరేషన్ నాయకులు సమావేశం అయ్యారు. ఈ మాట్లాడుతూ.. ప్రభుత్వ ఉద్యోగుల ఫెడరేషన్ ఛైర్మన్ వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ.. సర్వే శాఖలో ఏళ్ళుగా పెండింగ్‌లో ఉన్న ప్రొమోషన్లకు ఆమోద ముద్ర వేశారన్నారు.
410 అదనపు పోస్టులు కూడా ఆమోదించారని వెల్లడించారు. 1971 నుంచి పెండింగ్‌లో సర్వే శాఖ రీఆర్గనైజేషన్ దిశగా ముఖ్యమంత్రి చర్యలు తీసుకుంటున్నారన్నారు.అందుకే ముఖ్యమంత్రిని కలిసి కృతజ్ఞతలు తెలపామని వెల్లడించారు. 11,158 సిబ్బందిని గ్రామ, వార్డు సచివాలయాల నుంచి సర్వే శాఖలో కలిపారని పేర్కొన్నారు. దీంతో సర్వే శాఖ మరింత పటిష్టం అవుతుందని తెలిపారు. అర్హులైన గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు జూన్ 30 నాటికి ప్రొబేషన్ ప్రకటిస్తుందని.. ఈ మేరకు మరోసారి ముఖ్యమంత్రి పునరుద్ఘాటించారని చెప్పారు.