బ్రేస్ వేసుకున్నారా..? అయితే జాగ్రత్తగా లేకుంటే ఈ సమస్యలు ఉండే అవకాశం

-

నోటికి కొంతమంది క్లిప్స్ వేసుకోవటం మనం చూసే ఉంటాం. వాటిని బ్రేస్‌లు అంటారు. వంకరగా లేదా ఎత్తుగా ఉన్న పళ్లకు వీటిని వేస్తుంటారు.
బ్రేస్‌లు ఉన్నప్పుడు దంతాలను శుభ్రం చేయడం చాలా కష్టం. ఏమాత్రం అశ్రద్ధ చేసినా.. తద్వారా అందులో క్రిములు ఉండే అవకాశం ఉంటుంది. బ్రేస్‌లలో బ్యాక్టీరియా ఎక్కువ కాలం ఉంటే దంతక్షయం, మరకలు. చిగుళ్ల ఇన్‌ఫెక్షన్ వంటి సమస్యలు వస్తాయి. రెండు రకాల బేస్‌లు ఉంటాయి. ఒకటి ఫిక్స్ డ్ అయితే..రెండోది తొలగించుకోవచ్చు.. జంట బేస్‌లు ధరించేటప్పుడు గుర్తుంచుకోవలసిన ముఖ్యమైన విషయాలు ఈరోజు చూద్దాం.

1. మీ బ్రేస్‌లు దంతాల్లో స్థిరంగా ఉంటే అర టీస్పూన్ ఉప్పులో కొన్ని చుక్కల నిమ్మరసం కలిపి ఈ మిశ్రమంతో దంతాలను శుభ్రం చేసుకోవాలి. దంతాల నుంచి మీ బ్రేస్‌లు తొలగించగలిగితే వాటిని క్రమం తప్పకుండా కడగాలి. కడిగే సమయంలో ఒక టీస్పూన్ నిమ్మరసంలో ఒక టీస్పూన్ బేకింగ్ సోడా కలిపి శుభ్రం చేయాలి.

2. బ్రేస్‌లు ఉన్నవారు మౌత్ వాష్ ఉపయోగించటం కూడా మంచిదే.. మీరు మౌత్ వాష్ ద్రవాన్ని రోజుకు 3 నుంచి 4 సార్లు ఉపయోగించవచ్చు.

3. పర్మనెంట్‌ బ్రేస్‌లలో బ్రష్ చేయడం కష్టం. కాబట్టి ఫ్లాసింగ్ చాలా ముఖ్యం. కనీసం రోజుకు ఒకసారి మీ దంతాలను ఫ్లాస్ చేయండి. దిగువ, బ్రాకెట్ మధ్య ఫ్లాస్ చేయండి. ఇది కుహరం, చిగుళ్ళు వాపు, నోటి దుర్వాసన నుంచి మీకు కాస్త రిలీఫ్ ను ఇస్తుంది.

4. చాలావరకు.. మెటల్ బ్రేస్‌లు, సిరామిక్ బ్రేస్‌లు, ఎక్కువగా ఉపయోగిస్తారు. వాటిని అమర్చిన తర్వాత, చాక్లెట్, స్వీట్లు, నట్స్ వంటి వాటిని తినకుండా ఉండటం మంచింది. ఇవి బ్రేస్‌లకి అతుక్కుపోతాయి.

బ్రేస్ లు వేసినప్పుడు తినే ఆహారంలో కూడా చాలా శ్రద్ధ వహించాలి. గట్టిగా ఉండే పదార్థాలను అసలు తినకూడదు. వాటిని కొరకడం వల్ల బ్రేస్ లైన్ చెదిరే ప్రమాదం ఉంది. పళ్ల ఆకారాన్ని బట్టి..ఎన్ని రోజులు ఉంచుకోవాలో వైద్యులు సూచిస్తారు. దాన్నిబట్టి అవి ఉన్న అన్ని రోజులు..జాగ్రత్తగా ఉండాలి.

Read more RELATED
Recommended to you

Latest news