సికింద్రాబాద్-తిరుపతి నగరాల మధ్య రాకపోకలు సాగించే వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలును ఇవాళ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో సికింద్రాబాద్ – తిరుపతి వందే భారత్ ట్రైన్ ప్రత్యేకతలు ఇప్పుడు తెలుసుకుందాం. నిత్యం సికింద్రాబాద్ నుంచి తిరుపతికి ఆరు సూపర్ ఫాస్ట్ ట్రైన్స్ వెళతాయి. సికింద్రాబాద్ నుంచి తిరుపతికి సూపర్ ఫాస్ట్ ట్రైన్స్ లో 12 గంటల ప్రయాణం ఉంటుంది.
వందే భారత్ ట్రైన్ లో సికింద్రాబాద్ నుంచి తిరుపతికి 8.30 గంటల ప్రయాణం ఉంటుంది. దేశంలో ఇది 13వ వందే భారత్ ట్రైన్.. ఇందులో 8 కోచ్ లు 530 సీటింగ్ కెపాసిటీ కాగా… 1 ఎగ్జిక్యూటివ్, 7 చైర్ కార్ కోచ్ లు ఉంటాయి. ప్రయాణికుల ఆదరణ దృష్ట్యా కోచ్ లను పెంచే అవకాశం ఉంది. ఇవాళ ఉదయం 11.30 నుంచి 12.05 లోపు సికింద్రాబాద్ నుంచి వందే భారత్ ట్రైన్ ప్రారంభం కానుంది. ఈ నెల 9 నుంచి ఉదయం 6 గంటలకు ప్రయాణికులకు అందుబాటులో వందే భారత్ ట్రైన్ రానుంది. ఇవాల్టి వందే భారత్ ట్రైన్ స్పీడ్ గంటకు 77 కిలోమీటర్లు వెళుతుంది. సికింద్రాబాద్ నుంచి తిరుపతికి చైర్ కార్ చార్జీ 1680, ఎగ్జిక్యూటివ్ సీట్ ఛార్జీ 3080 రూపాయలుగా ఉంది. తిరుపతి నుంచి సికింద్రాబాద్ చైర్ కార్ ఛార్జీ 1625, ఎగ్జిక్యూటివ్ సీట్ ఛార్జీ 3030 రూపాయలు ఉంటుంది. వారానికి 6 రోజులు మాత్రమే సికింద్రాబాద్ – తిరుపతి మధ్య వందే భారత్ ట్రైన్ రాకపోకలు ఉంటాయి.