తోపుడు బండిమీద బట్టలు అమ్ముకునే వ్యక్తికి Ak47 గన్స్‌తో భద్రత..ఎందుకంటే..

-

సెలబ్రెటీలకు, రాజకీయ నాయకులకే బాడీగార్డులుంటారు..సామాన్యులకు బాడీగార్డులు ఉండటం మీరెప్పుడైనా చూశారా.. ఉత్తరప్రదేశ్‌లోని తోపుడు బండి నడుపుకుని జీవనం సాగించే అతనికి ఇద్దరు బాడీగార్డు Ak47 గన్‌లతో అతనికి రక్షణ కల్పిస్తున్నారు. బట్టలు కొనడానికి వచ్చిన వారు ఆ వ్యాపారి దగ్గర ఉన్న బాడీగార్డులను చూసి విస్తుపోతున్నారు. అసలేంటి కథ.. ఏమైంది..? ఓ సామాన్య వ్యక్తికి ఈ రేంజ్‌లో సెక్యురిటీ ఎందుకు ఇస్తున్నారు..?
ఉత్తర ప్రదేశ్ ఎటా జిల్లాకు చెందిన రామేశ్వర్.. అత్యంత సాధారణ చిరు వ్యాపారి. నిత్యం నాలుగు చక్రాల తోపుడు బండిపై చిన్నారులు.. మహిళల దుస్తులను పెట్టుకుని.. వివిధ ప్రాంతాలకు నడుచుకుంటూ.. వెళ్లి అమ్ముకుంటారు. రోజుకు రూ.300 నుంచి 500 కంటే ఎక్కువ రాదు. ఆ సొమ్ముతోనే కుటుంబాన్ని నెట్టుకు వస్తున్నారు. అలాంటి అత్యంత సాధారణ.. చిరు వ్యాపారికి.. ఏకంగా.. పొలిటీషియన్లు.. ఉన్నతాధికారులకు ఇచ్చే కట్టుదిట్టమైన భద్రతను కల్పించారు. ఏకే-47 గన్స్ తో ఉన్న ఇద్దరు యువ పోలీసులు ఈ వ్యాపారికి భద్రతగా నిలిచారు.

ఎందుకంటే..

రామేశ్వర్‌ తన భూమికి పట్టా ఇప్పించాలంటూ ఎస్పీ నేత మాజీ ఎమ్మెల్యే రామేశ్వర్ సింగ్ సోదరుడు జుగేంద్ర సింగ్‌ని కలిశారు. ఈ క్రమంలోనే వీరిద్దరి మధ్య వివాదం తలెత్తింది. దీంతో జుగేంద్ర సింగ్.. తనను కులం పేరుతో దూషించారని పోలీస్ స్టేషన్లో రామేశ్వర్ ఫిర్యాదు చేశారు. దీనిపై జుగేంద్ర సింగ్ హైకోర్టుకు కూడా వెళ్లారు. రామేశ్వర్ చేసిన ఆరోపణలన్నీ తప్పని.. ఈ కేసును కొట్టివేయాలని కోర్టును అభ్యర్థించారు. ఈ క్రమంలోనే రామేశ్వర్​ దయాల్​ను శనివారం కోర్టులో హాజరు కావాలని ఆదేశించింది.
కోర్టుకు వచ్చిన దయాల్​ను చూసిన న్యాయమూర్తి.. ఆశ్చర్యానికి గురయ్యారు. ఓ బాధితుడికి ఎందుకు భద్రత కల్పించలేదని పోలీసులను నిలదీశారు. బాధితుడికి ఇద్దరు బాడీగార్డ్స్​ను భద్రతగా నియమించాలని ఆదేశించారు. ఇంకేముంది.. కోర్డు ఆదేశాలతో వ్యాపారి రామేశ్వర్ బట్టలు అమ్ముతుండగా.. ఇద్దరు బాడీగార్డ్స్ ఏకే 47 తుపాకులతో ఆయనకు రక్షణ కల్పిస్తున్నారు.
దీంతో బట్టలు కొనడానికి వచ్చిన వినియోగదారులు.. రామేశ్వర్ బాడీగార్డ్స్‌ను చూసి ఆశ్చర్యపోతున్నారు. అయితే కొదరు తన దగ్గర బట్టలు కొనేందుకు జంకుతున్నారు. దీంతో వ్యాపారం దెబ్బతిందని.. తాను ఇబ్బందులు పడుతున్నానని దయాల్ వాపోతున్నారు. అసలు కేసు ఏమైంది, ఏంటి కథ అనేది మాత్రం బయటకు రాలేదు. సోషల్‌ మీడియా ద్వారా ఇలా రామేశ్వర్‌కు సెక్యురిటీ ఉన్న విషయం మాత్రం వైరల్‌ అవుతోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version