తెలుగమ్మాయి ప్రాణం తీసుకున్న సెల్ఫీ..

అమెరికా.. కాబోయే భర్తతో పాటు జలపాతాన్ని చూద్దామని వెళ్ళిన కమలా పోలవరపు, అక్కడే తన ప్రాణాలని పోగొట్టుకుంది. అమెరికాలోని బాల్డ్ నదిపై ఉన్న జలపాతాన్ని సందర్శించడానికి వెళ్ళిన కమలా, కాబోయే భర్త.. సెల్ఫీ తీసుకుందామని ప్రయత్నించగా పట్టుతప్పి కింద నీటిలో పడిపోయారు. వెంటనే స్పందించిన రెస్క్యూ టీమ్ రంగంలోకి దిగి కాబోయే భర్త ప్రాణాలని కాపాడింది. చాల సేపటి వరకు కమల జాడ కనిపించలేదు.

ఆ తర్వాత మరో టీమ్ రంగంలోకి దిగి ఆమెని బయటకి తీసుకువచ్చారు. వెంటనే హాస్పిటల్ కి తీసుకెళ్ళినా ప్రయోజనం లేకుండా పోయింది. ఆంధ్రప్రదేశ్, క్రిష్ణ జిలాకి చెందిన కమలా పోలవరపు, పై చదువుల కోసం అమెరికా వెళ్ళి, అక్కడే గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకుంది. 27ఏళ్ల వయసులో అమెరికాలో తన ప్రాణాలని పోగొట్టుకుంది.