ఈ సినిమాలకు స్వయంగా డైలాగ్స్ రాసుకున్న ఎన్టీఆర్.. అవేంటంటే?

-

విశ్వ విఖ్యాత నటసార్వభౌమ, నటరత్న నంద‌మూరి తార‌క‌రామారావు సినిమాలంటే తెలుగు వారికి ఎంతో ఇష్టం. ఆయన న‌టించిన సినిమాల్లో డైలాగ్స్ అయితే ఇప్పటికీ జనాలు చెప్తుంటారు. అయితే, కొన్ని డైలాగ్స్ ప్రనౌన్సియేషన్(ఉచ్ఛరణ) కొంత కష్టంగా ఉంటుంది. కానీ, అందరికీ అర్థమయ్యే రీతిలో ఆయన డైలాగ్స్ ఉంటాయి. అలా ఉండటం కోసం డైలాగ్స్ పట్ల సీనియర్ ఎన్టీఆర్ ప్రత్యేక శ్రద్ధ వహించేవారు. కాగా, పలు సినిమాల్లో ఆయన పాత్రలకు డైలాగ్స్ స్వయంగా ఎన్టీఆర్ రాసుకున్నారు. ఆ సినిమాలేంటో తెలుసుకుందాం.

ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్స్ కేవలం పంచ్ డైలాగ్స్ మాత్రమే కాదు..అందులో అర్థం కూడా ఉండేలా జాగ్రత్తలు వహిస్తారు దర్శక, నిర్మాతలు. డైలాగ్ రైటర్స్ అయితే చాలా శ్రద్ధ వహించి ఆ పాత్రకు సంభాషణలను రాస్తారు. పాత్రోచితంగానూ, అర్థవంతంగానూ మాటలు ఉండేలా చూస్తారు. ఇక ఎన్టీఆర్ కొన్ని డైలాగ్స్ ఆయనే స్వయంగా రాసుకోవడంతో పాటు కొత్త వారికి అవకాశమిచ్చి వారి చేత రాయించుకున్నారు.

ఒక వేళ డైలాగ్ తనకు నచ్చకపోతే ఎన్టీఆర్ మొహమాటం లేకుండా ఆ డైలాగ్స్ మార్చేయాలని చెప్పేసేవారు. ఒకవేళ రైటర్ రాయలేకపోతే తానే స్వయంగా రాసుకున్న సందర్భాలూ ఉన్నాయి. ‘జస్టిస్ చౌదరి’, ‘మేజర్ చంద్రకాంత్’ చిత్రాల్లో డైలాగ్ లను ఎన్టీఆర్ యే స్వయంగా రాసుకున్నారు.

ఇక ‘దాన వీర శూర కర్ణ’ చిత్రంలో ‘దుర్యోధన’ పాత్రకు తిరుపతి వెంకట కవుల చేత డైలాగ్స్ రాయించారు ఎన్టీఆర్. ‘ఆచార్యా దేవా’?..‘ఏమంటివి..ఏమంటివి..’, ‘పాంచాలి పంచ భర్తుక’ వంటి ఎన్టీఆర్ డైలాగ్స్ చాలా పాపులర్ అని అందరికీ తెలుసు. ఎన్టీఆర్ పౌరాణిక పాత్రలకు తన ఆహార్యంతో పాటు పదాల ఉచ్ఛరణ పైన ప్రత్యేక శ్రద్ధ వహించేవారు.

Read more RELATED
Recommended to you

Latest news