ఉద్యోగాలు ఎక్కడి నుంచి తేవాలే.. బెంగాల్ మంత్రి సంచలన వ్యాఖ్యలు..!!

-

పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఉద్యోగాలు లేవని, వేలాది మంది నిరుద్యోగులుగా మారుతున్నారని, వీరందరికీ ఉద్యోగాలు ఎక్కడి నుంచి తేవాలంటూ వ్యవసాయశాఖ మంత్రి సోవన్ దేవ్ ఛటర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. వేలాది మంది విద్యార్థులు ఉత్తీర్ణులై బయటికి వస్తున్నారన్నారు. దాదాపు 12 లక్షల మంది అభ్యర్థులు మాధ్యమిక్‌లో పాసయ్యారన్నారు. విద్యావంతులని నిరుద్యోగులుగా చేస్తున్నారు. గ్రాడ్యుయేషన్, ఎంఏ పూర్తిగా చేసుకున్నా.. ఉద్యోగాలు రావట్లేదన్నారు.

ఈ మేరకు తన ఇంటికి వచ్చే సగం మంది ఉద్యోగాల కోసం వస్తున్నారని అన్నారు. ఈ ఏడాది సెకండరీ పరీక్షల్లో 12 లక్షల మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. మొత్తం అభ్యర్థుల్లో 86 శాతం ఉద్యోగాలే మిగిలున్నారని ఆన్నారు. ఉద్యోగం కోసం వేలాది మంది ఇంటికి వస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటర్మీడియడ్, డిగ్రీ, పీజీ, మాస్టర్స్ చదువులు చదివి ఉండాలన్నారు. ప్రతిరోజు వేల సంఖ్యలో విద్యార్థులు బయటికి వస్తున్నారని ఆరోపించారు. వారికి మార్గ నిర్దేశం చేసే వారు లేరని ఆవేదన వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news