దేశంలో మహిళలపై అఘాత్యాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఇక తాజాగా కన్న కూతురినీ ఓ తండ్రి గర్భవతిని చేశాడు. ఈ దారుణమైన సంఘటన నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. ఈ ఘటన వివరాల్లోకి వెళితే… నిజామాబాద్ జిల్లా రుద్రూర్ గ్రామానికి చెందిన దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మూడేళ్ల కిందట భార్య శుభకార్యానికి వెళుతూ కూతుళ్లను ఇంట్లో వదిలి వెళ్ళిపోయింది.
అయితే మద్యం మత్తులో ఇంటికి వచ్చిన తండ్రి అదే అదునుగా చూసి పెద్ద కూతురు పైన దాడికి పాల్పడ్డాడు. దారుణంగా లైంగిక దాడికి పాల్పడ్డాడు దుర్మార్గపు తండ్రి. ఈ నేపథ్యంలోనే కొద్ది రోజుల తర్వాత అతని కూతురు గర్భం దాల్చింది. ఈ విషయాన్ని బయటకు చెబితే చంపేస్తానని బెదిరించాడు ఆ తండ్రి.
అంతటితో ఆగకుండా కొద్దిరోజుల తర్వాత తన కూతుర్ని తన వద్దకు పంపాలంటూ తల్లిని టార్చర్ పెట్టాడు. ఇక భర్త నీచ ప్రవర్తన తట్టుకోలేని… అతని భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఫోక్స్ చట్టం కింద కేసు నమోదు చేశారు. అయితే ఈ కేసును తాజాగా కోర్టు విచారించి…సంచలన తీర్పు ఇచ్చింది. ఆ నిందితుడికి 20 సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది కోర్టు.