యూఎస్ ఓపెన్‌లో దూసుకెళ్తోన్న టెన్నిస్ స్టార్ సెరెనా

-

యూఎస్ ఓపెన్‌లో టెన్నిస్ స్టార్ సెరెనా విలియమ్స్ దూసుకెళ్తున్నారు. ప్రపంచ ర్యాంకింగ్స్‌ లో టాప్ 600 కూడా లేని 40 ఏళ్ల సెరెనా వరల్డ్ నంబర్ 2 టెన్నిస్ స్టార్‌ను ఓడించింది. యూఎస్ ఓపెన్ రెండో రౌండ్‌లో అనెట్ కొంటావెయిట్‌పై వరుసగా మూడు సెట్లల్లో మట్టికరిపించింది. 7-6, 2-6, 6-2 తేడాతో భారీ విజయం సొంతం చేసుకుంది. దీంతో మూడో రౌండ్‌లో ప్రవేశించి తన కెరీర్‌లో 7వ గ్రాండ్‌స్లామ్ గెలుచుకోవాలనే లక్ష్యంతో సెరెనా కసితో పోరాడుతోంది.

సెరెనా విలియమ్స్
సెరెనా విలియమ్స్

అయితే యూఎస్ గ్రాండ్‌స్లామ్‌లోనే సెరెనా రిటైర్మెంట్ ప్రకటించనున్న విషయం తెలిసిందే. అయితే యూఎస్ ఓపెన్ చివరి టోర్నీయే తన లాస్ట్ మ్యాచ్ అని క్లారిటీ ఇవ్వలేదు. గ్రాండ్‌స్లామ్ టైటిల్ గెలిచిన తర్వాత రిటైర్మెంట్ ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం ఆమె ఆటతీరు చూస్తుంటే మరికొన్ని రోజుల పాటు ఆటలో కొనసాగేలా కనిపిస్తోంది. వింబుల్డన్ పోటీల్లో కూడా పాల్గొనే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news