నటిపై లైంగిక దాడి కేసులో… మళయాళం స్టార్ హీరో దిలీప్ ఇంటరాగేషన్

దేశవ్యాప్తంగా సంచలనం రేపిన మళయాళం హీరోయిన్ లైంగిక దాడి కేసులో మళయాళం స్టార్ హీరో దిలీప్ కుమార్ విచారణకు హజరుకానున్నారు. 2017 మళయాళం హీరోయిన్ భావనపై లైంగిక దాడి కేసులో స్టార్ హీరో దిలీప్ ప్రధాన నిందితుడిగా ఉన్నారు. అయితే ప్రస్తుతం దీనితో పాటు… దర్యాప్తు అధికారులపై దాడికి కుట్ర పన్నిన క్రైమ్ బ్రాంచ్ పోలీసు అధికారి మలయాళ సూపర్ స్టార్ దిలీప్‌ను విచారిస్తున్నారు. అయితే కేరళ హైకోర్ట్ దిలీప్ కు ఈనెల 27 వరకు అరెస్ట్ నుంచి రిలీఫ్ ఇచ్చింది. అయితే ఇటీవల తనపై దాడికి సంబంధించి విచారణను వేగవంతం చేయాలని.. తనకు న్యాయం చేయాలని భావన కేరళ సీఎం పినరయి విజయన్ కు లేఖ రాసింది. దీంతో ఈ కేసులో ఒక్కసారిగా కదలిక వచ్చింది. 

సాక్ష్యాలను ప్రభావితం చేయడంతో పాటు విచారణ అధికారులపై కుట్ర పన్నిని అభియోగాలను కూడా దిలీప్ ఎదుర్కొంటున్నాడు. దీంతో 23 నుంచి దిలీప్‌తో పాటు అతని సోదరుడు, బావ, ఇద్దరు స్నేహితులు సహా నలుగురు సహచరులను ఆదివారం క్రైం బ్రాంచ్ పోలీసుల ఎదుట విచారణకు హాజరుకావాలని కేరళ హైకోర్టు శనివారం ఆదేశించింది. జనవరి 27 వరకు నిందితులను అరెస్టు చేయబోమని, జనవరి 23 నుంచి ఉదయం 9 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు విచారిస్తామని కోర్టు శనివారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. నిందితుల విచారణ, జనవరి 27న జరిగిన విచారణపై నివేదికను తమ ముందు ఉంచాలని ప్రాసిక్యూటర్‌ను కోర్టు ఆదేశించింది. 2017లో తన తోటి నటిని కిడ్నాప్ చేసి, లైంగిక దాడి చేసిన కేసులో దిలీప్ ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. అప్పట్లో ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది.