మహానటిలో కీర్తిసురేష్ సావిత్రిని గుర్తుచేసింది. యాక్టింగ్‌తోనే కాదు.. లుక్‌లోనూ మహానటిలా మెస్మరైజ్ చేసింది. అయితే బాలీవుడ్ బయోపిక్స్‌కు లుక్‌తో సంబంధం లేదు. ముఖ్యంగా వ్యాంప్ రోల్స్ విషయంలో అలాగే వుండాలన్న రూల్ అసలు ఫాలో అవ్వరు. రీసెంట్‌గా రిలీజైన షకీలా టీజర్ చూస్తే.. మీరు కూడా నిజమే అంటారు.
90వ దశకంలో ఖాళీగా వున్న మాలీవుడ్ థియేటర్స్‌ను షకీలా సినిమాలు ప్రేక్షకులతో నింపేశాయి. కరోనా లాక్‌డౌన్‌తో మూతపడిన థియేటర్లు తిరిగి తెరుచుకున్నాక షకీలా పేరు మరోసారి వినిపింస్తుందంటూ.. టీజర్ రిలీజ్ చేశారు నిర్మాతలు. బాలీవుడ్ నటి రిచా చద్దా టైటిల్ రోల్ పోషించింది. ఇంద్రజిత్ లంఖేష్ దర్శకుడు. తెర ముందు.. వెనకాల షకీలా ఎందుర్కొన్న అనుభవాలను సినిమాలో చూపిస్తున్నాడు దర్శకుడు.
షకీలా ఫేస్ కట్స్‌కు రిచా ఏమాత్రం మ్యాచ్ కాదు. వ్యాంప్ రోల్స్‌తో గుర్తింపు తెచ్చుకున్న నటీమణుల విషయంలో ఈ పాయింట్‌ను గాలికొదిలేస్తారు. సిల్క్ స్మిత , షకీలా సౌత్‌లో పాపులర్ అయినట్టు.. బాలీవుడ్‌లో కాలేదు. దీంతో.. మన కథలు తీసుకుని.. బాలీవుడ్ భామలతో బయోపిక్స్ తీస్తూ.. పర్సనాలిటీ సరిపోతుందా? లేదా? అన్న విషయాన్ని పక్కన పెట్టేస్తున్నారు.
సిల్క్ స్మిత బయోపిక్ డర్టీ పిక్చర్‌లో విద్యాబాలన్ నటించింది. సిల్క్ పర్సనాలిటీగానీ.. కలర్‌గానీ.. ఫేస్ కట్స్‌గానీ.. కొద్దిక్కూడా విద్యాబాలన్‌లో లేకపోయినా.. యాక్టింగ్‌తో కవర్ చేసేసింది. కథ బలంగా వుంటే.. ఇవన్నీ చూడరన్న నమ్మకంతోనే షకీలాను తీసుకున్నారన్న మాట.