BREAKING : ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ షేన్ వార్న్ మృతి

-

ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్, స్టార్ స్పిన్నర్ షేన్ వార్న్ మరణించారు. తన నివాసంలో… ఒక్కసారిగా గుండెపోటు రావడంతో ఆయన మృతి చెందినట్లు సమాచారం అందుతోంది.

తన నివాసంలో విగత జీవిగా షేన్ వార్న్ పడి ఉండటాన్ని చూసిన ఆయన సిబ్బంది… వెంటనే ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే షేన్ వార్న్ మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు.

మాజీ క్రికెటర్ షేన్ వార్న్.. గుండె జబ్బు కారణంగానే మృతి చెందినట్లు వైద్యులు ప్రాథమిక విచారణకు వచ్చారు. ఇంకా ఆయన మృతి పై వివరాలు తెలియాల్సి ఉంది. ఇక ఈ విషాదకర వార్త విన్న క్రీడా ప్రియులు షాక్ కు గురి అవుతున్నారు. అటు ఆస్ట్రేలియా క్రికెటర్లు, ఇతర ప్లేయర్లు షేన్ వార్న్ మృతికి సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఒక గొప్ప మనిషిని క్రీడారంగం కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.కాగా ఇప్పటి వరకు షేన్వార్న్ 145 టెస్టులు ఆడగా 708 వికెట్లు పడగొట్టాడు. అటు వన్డేల్లో ఏకంగా తొంభై మూడు వికెట్లు తీసి శబాష్ అనిపించాడు.

Read more RELATED
Recommended to you

Latest news