‘మహారాజ’మౌళి.. మీ ఊహాశక్తికి హ్యాట్సాఫ్ : శంకర్

-

మాస్టర్ స్టోరి టెల్లర్ తెరకెక్కించిన విజ్యువల్ వండర్ ‘ఆర్ఆర్ఆర్’ చిత్రాన్ని చూసి సినీ, రాజకీయ ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్.. రాజమౌళి ప్రతిభను ప్రశంసిస్తూ క్రియేటివ్ గా పోస్టు పెట్టారు. ఆయన్ను ఆకాశానికెత్తి, అటువంటి సినిమాలను తాము తీయలేమని, కేవలం చూడగలమని తెలిపారు. తాజాగా ఈ చిత్రాన్ని ఇండియన్ జీనియస్ డైరెక్టర్ శంకర్ చూసి స్పందించారు.

రాజమౌళి గారి ఊహాశక్తి అతీతమైనదని, ఆయనకు హ్యాట్సాఫ్ చెప్పకుండా ఉండలేమని శంకర్ అన్నారు. ఎన్టీఆర్, చరణ్ ఎమోషనల్ పర్ఫార్మెన్స్ ఎఫ్పటికీ అలానే నిలిచిపోతుందని, చిత్రానికి పని చేసిన ప్రతీ ఒక్కరికి అభినందనలు తెలుపుతూ సోషల్ మీడియాలో శంకర్ పోస్టు పెట్టారు. ఈ పోస్టులో రాజమౌళిని ఆయన ‘మహారాజ’ మౌళి అని సంబోధించడం విశేషం.

రాజమౌళి తన నెక్స్ట్ ఫిల్మ్ ను టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబుతో చేస్తున్నారు. ఈ చిత్రానికి కూడా తన తండ్రి విజయేంద్రప్రసాద్ స్టోరి అందిస్తున్నారు. కాగా, శంకర్ తొలిసారి టాలీవుడ్ హీరోతో సినిమా చేస్తున్నారు. కార్తీక్ సుబ్బరాజ్ అందించిన స్టోరితో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌తో చిత్రం తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి మూడు షెడ్యూల్స్ పూర్తయినట్లు ‘ఆర్ఆర్ఆర్’ ఫిల్మ్ ప్రమోషనల్ ఇంటర్వ్యూలో రామ్ చరణ్ తేజ్ తెలిపారు. ‘ఆర్ సీ 15’ అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న చిత్రానికి ఎస్.ఎస్.థమన్ మ్యూజిక్ అందిస్తు్న్నారు. కియారా అద్వానీ ఇందులో హీరోయిన్ కాగా, శ్రీకాంత్, అంజలి, సునీల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఎస్ వీసీ బ్యానర్‌పై 50వ చిత్రంగా దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తున్నారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news