దీప్తి నాకు చాలా సార్లు డబ్బులు ఇచ్చింది : షన్ను

-

బిగ్ బాస్ సీజన్ 5 ఎండింగ్ కు చేరుకుంది. ఇంటి సభ్యుల్లో ఒకరు 50 లక్షలు గెలిచేందుకు రోజులు దగ్గర పడ్డాయి. ఈ నేపథ్యంలో ఆదివారం జరిగిన ఎపిసోడ్ లో 50 లక్షలు గెలిస్తే ఏం చేస్తారు అంటూ నాగ్ ప్రశ్నించగా ఒక్కొక్కరూ ఆసక్తికర సమాధానాలు ఇచ్చారు. కాజల్ ను 50 లక్షలు వస్తే ఏం చేస్తావ్ అని ప్రశ్నించగా తనకు 30 లక్షల అప్పు ఉందని దాన్ని కట్టేస్తా అని చెప్పింది. ఇక సన్నిని 50 లక్షలు వస్తే ఏం చేస్తావ్ అని ప్రశ్నించగా కొంత డబ్బుతో సెలూన్ షాప్ పెట్టుకుంటానని మిగతా డబ్బు మొత్తాన్ని తన అమ్మకు ఇస్తానని చెప్పాడు.

మానస్ కు అదే ప్రశ్న వేయగా అతడు నిర్మాణ సంస్థను పెట్టుకుంటా అంటూ సమాధానమిచ్చాడు. కొత్త నటీనటులకు అవకాశం ఇస్తానని చెప్పాడు. 50 లక్షలు వస్తే ఏం చేస్తావ్ అంటూ షన్నును ప్రశ్నించగా ఇంట్రెస్టింగ్ ఆన్సర్ ఇచ్చాడు. తన తల్లి ఇద్దరు అనాథలను దత్త తీసుకుందని వారి కోసం 25 లక్షలు ఇస్తానని… అదే విధంగా దీప్తి తనకు ఎన్నోసార్లు డబ్బు సాయం చేసిందని 25 లక్షలు ఆమెకు ఇస్తారని చెప్పుకొచ్చాడు. ఇదిలా ఉంటే ప్రస్తుతం షన్ను, దీప్తి పీకల్లోతు ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version