మల్లికార్జున్ ఖర్గేపై కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఖర్గేతే పార్టీకి ఒరిగేదేం లేదన్నారు. ఆయన లాంటి నేతలు కాంగ్రెస్ పార్టీలో మార్పులు తీసుకురాలేరని వ్యాఖ్యానించారు. ఖర్గే గెలిస్తే కాంగ్రెస్ పార్టీలో పాత పద్ధతులే కొనసాగుతాయని అన్నారు. మహారాష్ట్రలోని నాగ్‌పుర్‌లో థరూర్ మాట్లాడుతూ.. తనను ఎన్నుకుంటే కార్యకర్తలు కోరుకునే విధంగా పార్టీలో మార్పులు తీసుకొస్తానని పేర్కొన్నారు.
మరోవైపు కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకే తాను ఎన్నికల బరిలోకి దిగినట్లు మల్లికార్జున్ ఖర్గే పేర్కొన్నారు. ఎవరినో ఎదిరించడానికి కాదని స్పష్టం చేశారు. అనేక మంది సీనియర్లు, యువ నేతలు తనను ఎన్నికల్లో పోటీ చేయాలని కోరినట్లు తెలిపారు. ‘ఒకే వ్యక్తికి ఒకే పదవి’ సిద్ధాంతాన్ని అనుసరించి నామినేషన్ వేసిన రోజే రాజ్యసభలో ప్రతిపక్ష నేత పదవికి రాజీనామా చేశానని మల్లికార్జున్ ఖర్గే వెల్లడించారు.