ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీడియా రంగం బ్రష్టు పట్టిపోయింది అని చాలామంది దేశంలో ఉన్న ప్రముఖ రాజకీయ నేతలు అంటుంటారు. ఈ నేపథ్యంలో సీఎం జగన్ ముందు నుండి రాష్ట్రంలో తనని అనేక రీతులుగా, ఏపీ ప్రజల ముందు నెగిటివ్ గా చిత్రీకరిస్తూ చూపించిన ఎల్లో మీడియాని, అధికారంలోకి వచ్చాక ఆటలో అరటిపండు లాగా ఆ మీడియా విలేకరులను, తన సమావేశాలకు రానివ్వకుండా పక్కన పెట్టడం జరిగింది. అప్పట్లో చంద్రబాబు ఏ విధంగా అయితే వ్యవహరించడం జరిగిందో అదే స్థాయిలో..ప్రస్తుతం జగన్ తనకు వ్యతిరేకంగా ఉండే మీడియా విలేకర్లను పక్కన పెట్టారు. వాటిలో ఒకటి ఏబీఎన్.ఇటువంటి నేపథ్యంలో కరోనా వైరస్ విషయంలో దేశాలు మరియు రాష్ట్ర ప్రభుత్వాలు కంటి మీద కునుకు లేకుండా ఎక్కడికక్కడ ప్రజలను కాపాడటానికి అనేక నిర్ణయాలు తీసుకుంటున్నా తరుణంలో ఏబీఎన్ ఆర్కే జగన్ మీద దారుణమైన కథనాలు ప్రసారం చేశారు. పూర్తి వివరాల్లోకి వెళితే ఇటీవల కరోనా వైరస్ విషయంలో జగన్ నిర్వహించిన మీడియా సమావేశానికి ఎల్లో మీడియా చానల్స్ కి అనుమతి ఇవ్వలేదు. దీంతో ఏబీఎన్ ఆర్కే నిజాలు బయటకు వస్తాయని ఛానల్స్ ని పిలవటానికి భయపడుతున్నటు ‘విపత్కర సమయంలోను జగన్ కు అదే కసి’… అనే హెడ్డింగ్ తో కథనం ప్రసారం ప్రచురించారు.
దీంతో ఇలాంటి టైములో తన పై మరియు ప్రభుత్వం చేసిన పని తీరుపై విషపు రాతలు రాష్ట్రంలో ఏబీఎన్ ఆర్కే మీడియా పై చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి జగన్ సర్కార్ నిర్ణయం అయినట్లు ఏపీ రాజకీయాల్లో వార్తలు వినపడుతున్నాయి. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వ సహకారం కూడా ఉన్నట్లు..వార్తలు వస్తున్నాయి. అవాస్తవాలను ఇటువంటి టైములో ప్రచారం చేసే మీడియా ఛానల్ ని అరికట్టాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. ఇటువంటి నేపథ్యంలో జగన్ ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు చేపట్టడానికి రెడీ అయితే ఏబీఎన్ ఆర్కేకు ఇది ఊహించని పరిణామం అవుతుందని ఏపీ రాజకీయాల్లో టాక్.