హీరో సిద్ధార్థ్ కు షాక్.. త‌మిళ‌నాడు పోలీసులు స‌మ‌న్లు జారీ

-

స్టార్ ష‌ట్ల‌ర్ సైనా నెహ్వాల్ పై అస‌భ్య‌క‌ర వ్యాఖ్య‌లు చేసిన‌ హీరో సిద్ధార్థ్ కు త‌మిళ‌నాడు పోలీసులు షాక్ ఇచ్చారు. సైనా నెహ్వాల్ చేసిన ఒక ట్వీట్ కు హీరో సిద్ధార్థ్ అస‌భ్య‌క‌ర‌మైన వ్యాఖ్య‌లు చేస్తు ట్వీట్ చేశాడు. దీంతో ఈ ఘ‌ట‌న దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం రేపింది. చాలా మంది హీరో సిద్ధార్థ్ పై విమ‌ర్శ‌లు గుప్పించారు. ప‌లు చోట్ల కేసులు కూడా న‌మోదు అయ్యాయి. తాజా గా గురు వారం హీరో సిద్ధార్థ్ కు త‌మిళ నాడు పోలీసులు స‌మ‌న్లు జారీ చేశారు. ఈ విష‌యాన్ని చెన్నై పోలీస్ క‌మిష‌న‌ర్ అధికారికంగా ప్ర‌క‌టించారు.

కాగ సైనా నెహ్వాల్ పై హీరో సిద్ధార్థ్ అస‌భ్య‌క‌ర వ్యాఖ్య‌లు చేసిన అనంత‌రం క్ష‌మాప‌ణ‌లు చెప్పాడు. అయినా.. జాతీయ మ‌హిళా క‌మిష‌న్ హీరో సిద్ధార్థ్ పై చాలా సిరీయ‌స్ గా ఉంది. భవిష్య‌త్తులో ఇలాంటి ట్వీట్ లు రాకుండా చర్య‌లు తీసుకుంటుంది. హీరో సిద్ధార్థ్ ట్విట్ట‌ర్ అకౌంట్ ను బ్యాన్ చేయాలని ట్విట్ట‌ర్ యాజ‌మాన్యాన్ని మ‌హిళా క‌మిష‌న్ కోరింది. అలాగే హీరో సిద్దార్థ్ పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని త‌మిళ నాడు డీజీపీ కి లేఖ కూడా రాసింది. దీంతో హీరో సిద్ధార్థ్ కు చెన్నై పోలీసులు స‌మ‌న్లు జారీ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news