ఉక్రెయిన్ – రష్యా మధ్య జరుగుతున్న యుద్ధం ఎఫెక్ట్ ప్రపంచ దేశాలపై కూడా పడుతుంది. ఈ యుద్ధం ప్రభావంతో ముడి చమురు ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. దీంతో మన దేశంలో బల్క్ డీజిల్ ధరలు కూడా పెరుగిపోతున్నాయి. అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా మనం దేశంలో కూడా బల్స్ డీజిల్ ధరలు పెరుగుతున్నాయి. దీంతో బల్క్ డీజిల్ ను ఎక్కువగా వాడే ఆర్టీసీ, రైల్వే లకు భారీ నష్టం వస్తుంది. ప్రస్తుతం మన తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ నగరంలో బల్క్ డీజిల్ ధర లీటర్ కు రూ. 103.70 కి చేరింది.
అయితే మన దేశంలో ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు ఉండటంతో రిటైల్ డీజిల్ ధరలో ఎలాటి పెరుగుదల లేదు. ప్రస్తుతం రిటైల్ డీజిల్ ధర రూ. 94.62 గా ఉంది. దీంతో బల్క్ డీజిల్ అమ్మకాలు భారీగా తగ్గాయి. బల్క్ డీజిల్ ధరలు పెరగడంతో ఆర్టీసీ తో పాటు రైల్వేలు కూడా రిటైల్ డీజిల్ వైపే మొగ్గు చూపుతున్నారు. దీంతో రిటైల్ డీజిల్ అమ్మకాలు గణనీయంగా పెరిగిపోతున్నాయి.
సాధారణంగా ఒక లీటర్ రిటైల్ డీజిల్ కన్నా.. రూ. 5 నుంచి రూ. 6 తక్కువ ధరకే బల్క్ డీజిల్ లభించేంది. కానీ ప్రస్తుతం ఉక్రెయిన్ – రష్యా యుద్దం కారణంగా ధరలు భారీగా పెరిగిపోయాయి. కాగ మన రాష్ట్రం ఎన్నికలు ముగిసిన తర్వాత.. రిటైల్ డీజిల్ ధరలు కూడా భారీగా పెరిగే అవకాశం ఉంది.