వైసీపీకి షాక్‌.. ఆయ‌న‌పై చ‌ర్య‌లు తీసుకోవాల్సిందే.. ర‌ఘురామ హ్యాపీ

-

ఏపీ వైసీపీ రెబ‌ల్ ఎంపీ రఘురామ కృష్ణం రాజు వ్య‌వ‌హారం ఏపీ రాజ‌కీయాల్లో ఎంత సంచ‌ల‌నం సృష్టించిందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఎందుకంటే ఆయ‌న వైసీపీలో ఉంటూ జ‌గ‌న్‌పైనే ఆరోప‌ణ‌లు చేయ‌డం ఆ త‌ర్వాత ప్ర‌భుత్వంపై ఆయ‌న చేసిన విమ‌ర్వ‌ల‌తో వైసీపీ ప్ర‌భుత్వం కూడా యాక్ష‌న్‌లోకి దిగ‌డం ఎంత సంచ‌లనం రేపిదో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఇక ఆయ‌న థ‌ర్డ్ డిగ్రీ విష‌య‌మై ఇప్ప‌టికీ కోర్టులో విచార‌ణ జ‌రుగుతూనే ఉంది.

ysrcp mp raghurama krishnamraju to respond on notices issued by party

ఇక ఇటు రఘురామ త‌న‌పై థర్డ్ డిగ్రీ చేశార‌నే ఆరోప‌ణ‌ల‌తో ఏపీ సీఐడీ అధికారుల‌పై ఆయ‌న కేంద్ర హోం శాఖ‌కు అలాగే మాన‌వ హ‌క్కుల క‌మిష‌న్‌కు ఫిర్యాదు చేసిన సంగ‌తి తెలిసిందే. అయితే ఈ విష‌యంలో ర‌ఘురామ‌పై కూడా వేటు వేయాల‌ని అటు వైసీపీ ప్ర‌భుత్వం కూడా స్పీక‌ర్ ఓం బిర్లాకు ఫిర్యాదు చేసిన సంగ‌తి తెల‌సిందే.

ఇక ఈ ప‌ర‌స్ప‌ర ఆరోప‌ణ‌ల్లో ర‌ఘురామ ఓ అడుగు ముందుకు వేసిన‌ట్టు తెలుస్తోంది. తనపై దాడి చేసిన ఏపీ సీఐడీ చీఫ్ సునీల్ కుమార్‌పై ఎట్టి ప‌రిస్థితుల్లో చ‌ర్యలు తీసుకోవాల్సిందేనంటూ కేంద్రహోంశాఖకు ఆర్ ఆర్ ఆర్ కంప్ల‌యింట్ చేయ‌గా హోం శాఖ రియాక్ట్ అయ్యి సునీల్ కుమార్ పై చర్యలు తీసుకోవాల్సిందే అంటూ ఏపీ సర్కారుకు ఆర్డ‌ర్ వేసింది. దీంతో ర‌ఘురామ‌కు బీజేపీ స‌పోర్టు చేస్తుంద‌నే అనుమానాల‌కు బ‌లం చేకూరుతోంది. దీంతో పాటు ఈ మ‌ధ్య వైసీపీ చేస్తున్న విమ‌ర్శ‌ల‌కు ఈ విధంగా కౌంట‌ర్ వేసిన‌ట్టు అయింది.

Read more RELATED
Recommended to you

Latest news