కొన్ని సార్లు ఆన్లైన్ లో ఒక వస్తువును ఆర్డర్ చేస్తే మరొక వస్తువు రావడం చాలా సందర్భాలలో చూశాము. ఇది మనము ఒక ఫ్రాడ్ గా చెప్పుకోవచ్చు. కొన్ని ఆన్లైన్ డెలివరీ కంపెనీ లు కంప్లైంట్ పెడితే స్పందించి సరైన వస్తువును పంపుతారు. కొన్ని ఫ్రాడ్ కంపెనీ లు మాత్రమే ఫోన్ లిఫ్ట్ చేసే పరిస్థితి కూడా ఉండదు. కాగా తాజాగా జరిగిన ఒక సంఘటన అందరినీ షాక్ కు గురి చేస్తోంది. తమిళనాడులోని తంజావూరు జిల్లా తిరువయ్యూర్ కు చెందిన మహమ్మద్ ఖాసీం అనే వ్యక్తి ఆన్లైన్ లో రైస్ కుక్కర్ ను ఆర్డర్ చేశారు. అయితే డెలివరీ సమయంలో ప్యాకెట్ ను తీసుకుని ఓపెన్ చేసిన ఖాసీం షాక్ కు గురయ్యాడు.
అందులో కుక్కర్ కు బదులుగా మనిషి పుర్రె ఉండడంతో ఖాసీం భయాందోళనకు గురయ్యాడు. పైగా ఆ పార్సెల్ అంతా కూడా రక్తంతో తడిసిపోయి ఉండడంతో భయం కలిగినట్లు తెలిసిందే. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో..పోలీసులు ఖాసీం కు ఎవరైనా శత్రువులు ఉన్నారా ? ఎవరైనా ఇతన్ని భయపెట్టడానికి ఇలా చేశారా లేదా ఇంకేమైనా కారణం ఉందా అని విచారణ చేస్తున్నారు.