మటన్ ప్రియులకు షాకింగ్ న్యూస్.. ఇకమీదట తింటే అంతే..

-

నాన్ వెజ్ ప్రియులకు చికెన్, మటన్ అంటే ఎంత ఇష్టం ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. అయితే ఇప్పుడు ఏం తినాలనుకున్నా కూడా కాస్త ఆలొచించి తినాలి. డబ్బుల కోసం కొందరు కక్కుర్తి గాళ్ళు దారుణాలు చేస్తున్నారు,. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు..కాసుల కక్కుర్తితో ఓ వ్యాపారి దారుణానికి ఒడిగట్టాడు. ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్నాడు. కుళ్లిన మాంసాన్ని ఫ్రిజ్ లో నిల్వ ఉంచి దాన్నే విక్రయిస్తున్నాడు.

నిల్వ చేసిన మాంసాన్ని విక్రయిస్తున్న వారిపై విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ హెల్త్ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ క్రమంలో షాకింగ్ విషయాలు వెలుగుచూశాయి. ఓ వ్యాపారి ఇంట్లో సోదాలు చేయగా.. భారీగా కుళ్లిన మాంసం నిల్వలు గుర్తించారు అధికారులు.కొన్నిరోజుల నుంచి కృష్ణలంకలోని భూపేష్ నగర్ లో రాము అనే వ్యాపారి నిల్వ ఉంచిన మేకలు, పొట్టేళ్ల మాంసాన్ని విక్రయిస్తున్నట్టు అధికారులకు ఫిర్యాదులు అందడంతో ఆయా దుకాణం పై అధికారులు దాడులు చేశారు..

నిల్వ చేసిన మాంసంతో వ్యాపారం చేస్తున్నట్లు గుర్తించారు. వ్యాపారి రాము ఏకంగా 150 కేజీల కుళ్లిన మాంసాన్ని ఫ్రిజ్ లో నిల్వ ఉంచాడు. ఆ మాంసం బాగా దుర్వాసన వెదజల్లుతోంది. వీఎంసీ అధికారులు ఆ మాంసాన్ని సీజ్ చేశారు. గతంలో కూడా రాము ఇలానే కుళ్లిన మాంసాన్ని విక్రయిస్తున్నట్లు సమాచారం ఉందని విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ హెల్త్ ఆఫీసర్ తెలిపారు.

చనిపోయిన గొర్రెలను తీసుకొచ్చి,ఇంట్లోనే వాటిని కోసి గుట్టుచప్పుడు కాకుండా విక్రయిస్తాడని చెప్పారు. అంతేకాకుండా కొంత మాంసాన్ని హోల్ సేల్ ధరలతో షాపులకు కూడా అమ్ముతున్నాడని వెల్లడించారు. ఇలాంటి మాంసం తింటే అనేక రోగాలు వస్తాయని అధికారులు హెచ్చరించారు. కుళ్లిన మాంసంతో వ్యాపారం చేస్తున్న వ్యాపారిపై అధికారులు కేసు నమోదు చేశారు.. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది..ఇది మటన్ ప్రియులకు హెచ్చరిక అనే చెప్పాలి.. జాగ్రత్త సుమీ.. లేకుంటే కుళ్ళిన వాటిని తిని ప్రాణాలను పొగొట్టుకోవడం ఖాయం..

Read more RELATED
Recommended to you

Latest news