అంత మంది స్టార్ హీరోలకు హిట్స్ ఇచ్చిన హీరోయిన్..ఎవరంటే?

-

జనరల్ గా సినిమా ఇండస్ట్రీలో హీరో కాని హీరోయిన్ కాని నటించిన సినిమా ఒకసారి ఫ్లాప్ అయితే చాలు..వెంటనే హిట్ కొట్టాలని కసితో మూవీస్ చేస్తుంటారు. తమపైన ఉన్న అపజయ ముద్రను వీలయినంత త్వరగా తొలగించుకోవాలని అనుకుంటారు. అలా హీరో, హీరోయిన్స్ వెంటనే సక్సెస్ ఫుల్ డైరెక్టర్ తో పిక్చర్ చేయాలని అనుకుంటారు. అలా చేసినప్పటికీ సక్సెస్ ఉంటుందన్న గ్యారెంటీ ఉండబోదు. కానీ, ఈ హీరోయిన్ మాత్రం అంత మంది స్టార్ హీరోలకు సక్సెస్ ఇచ్చింది. ఆమె ఎవరంటే..

 

లోకనాయకుడు కమల్ హాసన్ కూతురు శ్రుతిహాసన్..మల్టీ టాలెంటెడ్ పర్సన్ అని అందరికీ తెలుసు. ఈమె ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి పలు సినిమాలు చేయగా, అవి బాక్సాఫీసు వద్ద అనుకున్న స్థాయిలో ఆడలేదు. కానీ, తర్వాత కాలంలో ఈ భామ నటించిన చిత్రాలు వరుస విజయాలు సాధించాయి. అలా ఈ సుందరి లక్కీ హీరోయిన్ అయిపోయింది. అప్పటి వరకు ఫ్లాపుల్లో ఉన్న హీరోలకు ఈ భామ ఒకరకంగా హిట్ సినిమాలు ఇచ్చిందని చెప్పొచ్చు.

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ..అప్పటి వరకు ఒక్క హిట్ కూడా అందుకోని క్రమంలో ..శ్రుతిహాసన్ , పవన్ కల్యాణ్ జంటగా నటించిన ‘గబ్బర్ సింగ్’ ఇండస్ట్రీ హిట్ అయింది. అది శ్రుతిహాసన్ కు తొలి బ్లాక్ బాస్టర్ పిక్చర్. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు ‘ఎవడు’ ఫిల్మ్ ద్వారా హిట్ ఇచ్చింది.

మాస్ మహారాజ రవితేజకు ‘బలుపు’ సినిమాతో హిట్ ఇచ్చిన శ్రుతి..విశాల్ కు ‘పూజ’ ఫిల్మ్ తో సూపర్ హిట్ ఇచ్చింది. ఇక బన్నీ అలియాస్ అల్లు అర్జున్ తో ‘రేసుగుర్రం’ సినిమాలో నటించిన శ్రుతిహాసన్..ఆ సినిమా కూడా సక్సెస్ చేసింది. ఇందులో శ్రుతి నటనకు ప్రేక్షకులకు మంచి మార్కులు వేశారు. నాగచైతన్య తో ‘ప్రేమమ్’ చేసిన శ్రుతి హాసన్..మహేశ్ బాబుతో ‘శ్రీమంతుడు’ చేసి ఇద్దరికీ సూపర్ హిట్స్ ఇచ్చింది. అలా ఒకరకంగా అప్పటి వరకు ఫ్లాపుల్లో ఉన్న హీరోలకు సూపర్ హిట్ సినిమాలను ఇచ్చిందని చెప్పొచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news