టీమిండియా ఓపెనర్ శుభ్‌మన్ గిల్ మరో ఘనత సాధించాడు. ఐసీసీ వన్డే బ్యాటర్ల ర్యాంకింగ్స్ లో టీమిండియా యువ ఆటగాడు శుభ్‌మన్ గిల్ అదరగొట్టాడు. తాజాగా ప్రకటించిన ఐసీసీ ర్యాంకింగ్స్ లో గిల్ ఏకంగా 93 స్థానాలు ఎగబాకి 38వ స్థానానికి చేరుకున్నాడు. ఇటీవల జింబాబ్వేతో జరిగిన సిరీస్ లో గిల్ ఫెంటాస్టిక్ బ్యాటింగ్ తో అదరగొట్టాడు.
ఈ సిరీస్ లో మూడు మ్యాచ్ లు ఆడిన గిల్ 245 పరుగలు సాధించాడు. కాగా..హరారే వేదికగా జింబాబ్వే తో మూడో వన్డేలో గిల్ అద్భుతమైన సెంచరీ సాధించాడు. ఈ మ్యాచ్ లో 97 బంతులు ఎదుర్కొన్న గిల్ 170 పరుగులు సాధించాడు. తద్వారా ఓ అరుదైన ఘనతను గిల్ తన ఖాతాలో వేసుకున్నాడు.
వన్డేల్లో జింబాబ్వే గడ్డపై అత్యధిక వ్యక్తిగత స్కోర్ సాధించిన భారత ఆటగాడిగా గిల్ నిలిచాడు. ఇప్పటివరకు ఈ రికార్డు టీమిండియా దిగ్గజం సచిన్ టెండూల్కర్ పేరిట ఉండేది. 1998లో బులవాయో వేదికగా జింబాబ్వే తో జరిగిన వన్డేలో 127 పరుగులు సాధించి సచిన్ అజేయంగా నిలిచాడు. తాజా మ్యాచ్ లో 130 పరుగులు సాధించిన గిల్ సచిన్ 24 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టాడు.