శ్యామ్ సింగ‌రాయ్ పార్ట్ 2.. హీరోగా ప‌వ‌ర్ స్టార్

-

రాహుల్ సాంకృత్య‌న్ ద‌ర్శ‌క‌త్వంలో నాని హీరోగా వ‌చ్చిన శ్యామ్ సింగ‌రాయ్ సినిమా హిట్ టాక్ తో దూసుకుపోతుంది. దీంతో చిత్ర యూనిట్ ఇటీవ‌ల‌ స‌క్స‌స్ సెల‌బ్రేష‌న్స్ ను జ‌రుపుకుంది. ఈ సంద‌ర్భం గా డైరెక్ట‌ర్ రాహుల్ సాంకృత్య‌న్ చేసిన కామెంట్స్ వైర‌ల్ అవుతున్నాయి. ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఒప్పుకుంటే.. శ్యామ్ సింగరాయ్ పార్ట్ 2 తీస్తాన‌ని అన్నారు. ఇలాంటి ప‌వ‌ర్ ఫుల్ పాత్ర‌లు ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ బాగా సెట్ అవుతాయ‌ని అన్నారు.

ఆయ‌న అభిమానుల‌కు కూడా బాగా న‌చ్చుతుంద‌ని అన్నారు. త‌ను ప‌వ‌న్ క‌ళ్యాణ్ అభిమానిని అన్నారు. ఆయ‌న అంటే త‌న‌కు చాలా ఇష్ట‌మ‌ని అన్నారు. ఆయ‌న ఒప్పుకుంటే శ్యామ్ సింగ‌రాయ్ పార్ట్ 2 ను ఇంకా ప‌వ‌ర్ ఫుల్ గా తీస్తాన‌ని అన్నారు. థీయేట‌ర్లు ప‌గిలి పోయేలా ఉంటుంద‌ని అన్నారు. అయితే ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ సినిమాకు గ్రీన్ సిగ్న‌ల్ ఇస్తే.. ఫ‌లితం మ‌రో లెవ‌ల్ లో ఉంటుంద‌ని అభిమానులు అంటున్నారు. అయితే రాహుల్ సాంకృత్య‌న్ చేసిన కామెంట్స్ పై ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ స్పందించి సినిమా తీయాల‌ని అభిమానులు కోరుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news