నేడు, రేపు ఎస్‌ఐ రాత పరీక్ష.. ఈ రూల్స్ పాటించాల్సిందే

-

ఇవాళ, రేపు ఎస్ఐ పోస్టుల‌కు తుది రాత‌ప‌రీక్ష‌ల‌ను నిర్వ‌హించేందుకు తెలంగాణ స్టేట్ లెవ‌ల్ పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు అన్ని ఏర్పాట్లు చేసింది. అయితే ఇవాళ ప్ర‌ధాని మోదీ హైద‌రాబాద్ ప‌ర్య‌ట‌న‌కు వ‌స్తున్నారు.

ఈ నేప‌థ్యంలో హైద‌రాబాద్‌లో ప‌రీక్ష రాసే ఎస్ఐ అభ్య‌ర్థులు.. ట్రాఫిక్ ఆంక్ష‌ల దృష్ట్యా 2 గంట‌ల ముందే ప‌రీక్షా కేంద్రాల‌కు చేరుకోవాల‌ని తెలంగాణ రాష్ట్ర డీజీపీ అంజ‌నీ కుమార్ సూచించారు. మోదీ రానున్న నేప‌థ్యంలో సికింద్రాబాద్ ప‌రిస‌ర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్ష‌లు విధించారు.

ఈ ప్ర‌భావం న‌గ‌రం అంత‌టా ప‌డే అవ‌కాశం ఉన్నందున‌.. అభ్య‌ర్థులు ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయే అవ‌కాశం ఉంది. దాదాపు అన్ని ర‌హ‌దారులు బిజీగా ఉండే అవ‌కాశం ఉన్నందున త‌మ ప‌రీక్షా కేంద్రాల‌కు 2 గంట‌ల ముందే వెళ్లేలా అభ్య‌ర్థులు ప్లాన్ చేసుకోవాల‌ని డీజీపీ అంజ‌నీ కుమార్ సూచించారు. ట్రాఫిక్ పోలీసుల‌కు, ఎస్ఐ అభ్య‌ర్థుల‌కు వాహ‌న‌దారులు, ప్ర‌జ‌లు స‌హ‌క‌రించాల‌ని కోరారు.

 

Read more RELATED
Recommended to you

Latest news