అక్కడ తొలి చూపులోనే ప్రేమలో పడిపోయిన సిద్ధార్థ్..ఎవరిని చూసో తెలుసా?

-

ఇండియన్ జీనియస్ డైరెక్టర్ శంకర్ డైరెక్షన్‌లో తెరకెక్కిన ‘బాయ్స్’ చిత్రంతో సిద్ధార్థ్‌కు మంచి పేరు వచ్చింది. ఇక ఆ తర్వాత వచ్చిన ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా, బొమ్మరిల్లు’ సినిమాలతో తెలుగు ప్రేక్షకుల ఫేవరెట్ హీరో అయిపోయారు. అమ్మాయిలకు అయితే కలల రాకుమారుడు అయిపోయారు.

ఆ తర్వాత తెలుగుతో పాటు ఇతర భాషల్లో కూడా నటించి తన కంటూ ఒక ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. అయితే, సిద్ధార్థ్ యాక్షన్, థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్ మూవీస్ చేసినిప్పటికీ ఆయన ఇమేజ్ లవర్ బాయ్ లాగానే ఇప్పటికీ కొనసాగుతుండటం విశేషం.

తాజాగా తన ఇన్ స్టా గ్రామ్ లో లైట్ పింక్ కలర్ షర్ట్, షార్ట్ తో దిగిన ఫొటోలు షేర్ చేసిన ఎవర్ గ్రీన్ యంగ్ హీరో.. ఇంట్రెస్టింగ్ క్యాప్షన్ ఇచ్చారు. ‘గులాబీ రంగును చూడగానే దానితో ప్రేమలో పడిపోయానని’ పేర్కొన్నాడు. ఫ్రాన్స్ లో జరిగిన కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో గులాబీ రంగను చూసి సిద్ధార్థ్ ఇష్టపడ్డారట. ఈ క్రమంలోనే  గులాబీ రంగు షార్ట్ ధరించిన ఫొటోలు షేర్ చేశాడు. ఇక ఈ ఫొటోలు చూసిన నెటిజన్లు..‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్ ఫర్ యూ, ఎప్పటికీ యంగ్ సిద్ధార్థ్, హీరో’ అని కామెంట్స్ చేస్తున్నారు.

సిద్ధార్థ్ తెలుగు ప్రేక్షకులకు చివరగా ‘‘మహాసముద్రం’’ సినిమాలో కనిపించాడు. RX100 ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ పిక్చర్ బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ప్రస్తుతం సిద్దార్థ్ ‘టక్కర్’ సినిమాలో నటిస్తున్నాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version