జ్యోతిరాదిత్య సిందియా… రాహుల్ గాంధీ టీం లో కీలక వ్యక్తి. కాంగ్రెస్ అగ్ర నేతల్లో ఒకరు. రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యతలను వద్దనుకున్న తర్వాత ఆ అవకాశం ఈయనగారికే వస్తుంది అని చాలా మంది నేతలు భావించారు. ఆయనను కచ్చితంగా అధ్యక్షుడ్ని చేస్తారని చూసారు. ఏమైందో ఏమో తెలియదు గాని ఆ తర్వాత కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలను సోనియా గాంధీ తీసుకున్నారు.
అయితే కాంగ్రెస్ లో ఆయనకు ప్రాధాన్యత ఏ మాత్రం తగ్గించలేదు అధిష్టానం. గత ఏడాది జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో సింధియా గుణ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అయితే ఆయన ప్రాధాన్యతను గ్రహించిన కాంగ్రెస్ అధిష్టానం రాజ్యసభ సీటు ఇవ్వడానికి రెడీ అయింది. మధ్యప్రదేశ్ నుంచి ఆయనను రాజ్యసభకు పంపించాలని భావించారు. అందుకు అంతా సిద్దం చేసింది కూడా కాంగ్రెస్.
ఈ తరుణంలో సిందియా కోలుకోలేని షాక్ ఇచ్చారు. తుమ్మితే ఊడిపోయే విధంగా ఉన్న ప్రభుత్వానికి దెబ్బ కొట్టారు. తనకు ముఖ్యమంత్రి పదవి రాలేదు అనో లేక మరేదైనా కారణమో గాని తన వర్గాన్ని ప్రభుత్వం నుంచి చీల్చారు సింధియా. ఇప్పుడు వాళ్ళను వేరు చేసి రాజకీయం మొదలుపెట్టారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసారు. ఆయన ఎందుకు అలా చేసారు అనేది ఇప్పుడు కాంగ్రెస్ అధిష్టానానికి అర్ధం కాని ప్రశ్న.
కేంద్ర మంత్రి పదవి ఆఫర్ చేసింది బిజెపి. సాదా సీదా పదవి కాదు అది. ఆర్ధిక శాఖ మంత్రి పదవి… ఆర్ధిక శాఖ నుంచి నిర్మలా సీతారామన్ ని తప్పించే అవకాశాలు ఉన్నాయి. ఆ పదవి ఈయనకు ఇవ్వడానికి అధిష్టానం సిద్దమైంది. త్వరలో కేంద్ర మంత్రి వర్గం విస్తరణ జరుగుతుంది. ఆయన తండ్రి మాధవరావు సింధియా కూడా కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా ఎదిగారు. కేంద్రంలో కీలక పదవులు అనుభవించారు. అలాంటి కుటుంబం ఇప్పుడు కాంగ్రెస్ కి షాక్ ఇచ్చింది.