సీతారామం.. దుల్కర్ సల్మాన్ తెలుగులో నటిస్తున్న చిత్రం సీతారామం. నేడు పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మృణాల్ ఠాగూర్ హీరోయిన్ గా నటించగా నేషనల్ క్రష్ రష్మిక మందన్న కీలక పాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాలో ఈమె హీరోయిన్గా కాకుండా ఒక కీలకపాత్ర పోషించింది. ముఖ్యంగా ఈ సినిమా ఈరోజు విడుదల కానున్న నేపథ్యంలో ప్రేక్షకుల కోసం ఉదయం ప్రీమియర్ షోను ప్రదర్శించారు. ఇక మొదటి షో తోనే హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. ఈ సినిమా అంతే కాదు చాలా సంవత్సరాల తర్వాత ఒక మధురమైన ప్రేమ కథను చూసాము అంటూ ప్రేక్షకులు ట్విట్టర్ వేదికగా ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఇక ముఖ్యంగా ఈ సినిమాలో దుల్కర్, మృణాల్ మధ్య వచ్చే ప్రేమ సన్నివేశాలు చిత్రానికి హైలైట్ గా నిలిచాయి. ఇక ఎప్పుడూ మాస్, యాక్షన్, రొమాంటిక్ లాంటి చిత్రాలే కాకుండా స్వచ్ఛమైన ప్రేమ కథను చూసి కొన్ని సంవత్సరాలు గడిచిపోయింది అని చెప్పవచ్చు. అలాంటి అద్భుతమైన ప్రేమ కథతో మళ్ళీ మన ముందుకు వచ్చారు హను రాఘవపూడి.. సాధారణంగా ఈయనపై ఒక నెగెటివిటీ కూడా ఉంది..ఫస్ట్ హాఫ్ తెరకెక్కించినంతగా సెకండ్ హాఫ్ తెరకెక్కించలేడు అని ఇక ఇదే విషయాన్ని సీతారామం ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా ఆయన వెల్లడించారు. కానీ సినిమా మాత్రం చాలా అద్భుతంగా ఉందని ప్రేక్షకులు ప్రశంసల వర్షం కురిపిస్తూ ఉండడం గమనార్హం. ఇక ఈ సినిమాతో హాను రాఘవపూడి తన ఖాతాలో బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్నాడు.
#HanuRaghavapudi sir, Andhala rakshashi nundi #fdfs chustunna…#SitaRamam will be Master piece & will be remembered forever in Telugu cinema❤️❤️❤️ #sitaramamreview #Blockbuster #SwapnaDutt #Dulquer pic.twitter.com/PjVPIX8Yyw
— PRASANTH ANKIREDDY (@prasanth_ank7) August 4, 2022
ఒక యుద్ధంతో రాసిన ప్రేమ కథగా చిరస్థాయిగా ఈ సినిమా మిగిలిపోతుందని చెప్పవచ్చు. ఇక ఈ సినిమాలో ప్రతి ఒక్కరి పాత్ర కూడా చాలా అద్భుతంగా ప్రదర్శించబడింది . ముఖ్యంగా ఈ సినిమాలో వెన్నెల కిషోర్ , గౌతమ్ మీనన్ , భూమిక ,సుమంత్, భాస్కర్ తదితరులు ముఖ్య పాత్రలలో నటించారు. ఇక వైజయంతి మూవీస్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ సినిమా ఇప్పటివరకు వచ్చిన టీజర్, ట్రైలర్స్ అన్నీ కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ప్యూర్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ సినిమా కలెక్షన్స్ విషయంలో ఎలా గుర్తింపు తెచ్చుకుంటుందో తెలియాల్సి ఉంది.
#MovieCritiq 𝗥𝗮𝘁𝗶𝗻𝗴 :
𝗠𝗼𝘃𝗶𝗲 : #SitaRamam
𝗥𝗮𝘁𝗶𝗻𝗴 : 3/5
𝗣𝗼𝘀𝗶𝘁𝗶𝘃𝗲𝘀 : @dulQuer gave his 100% efforts as usual
~ bgm 👌
~ @mrunal0801 and @bhumikachawlat impressed 👌
𝗡𝗲𝗴𝗮𝘁𝗶𝘃𝗲𝘀 : Slow First half but good second half 👍#SitaRamamreview #MovieCritiq pic.twitter.com/vp1VRoosoF— The Movie Critic ! (@MovieCritiq) August 5, 2022