చాలామంది ఎక్కువ సేపు కూర్చునే పని చేస్తూ ఉంటారు. ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరు కూడా సాఫ్ట్వేర్ కంపెనీలలో ఉద్యోగాలని చేస్తున్నారు అలాంటప్పుడు ఎక్కువ సేపు కూర్చోవాల్సిన పరిస్థితి కలుగుతోంది. కుర్చీలో ఎక్కువ సేపు కూర్చోవడం వలన రకరకాల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు అరగంట నుండి 12 గంటల పాటు ఎంత సేపు కూర్చున్నా కూడా అసలు ఆరోగ్యం మంచిది కాదని అంటున్నారు.
కుర్చీలో ఎక్కువసేపు కూర్చోవడం వలన వెన్నెముక మీద ప్రెషర్ పడుతుందని పైగా కొవ్వు కూడా కరగకపోవడంతో రకరకాల ఇబ్బందులు ఎదుర్కోవాలని చాలామంది రకరకాల ఇబ్బందుల్ని ఎక్కువసేపు కూర్చోవడం వలన ఎదుర్కొంటున్నారని అంటున్నారు. అయితే ఎక్కువ సేపు కూర్చోకుండా పది నిమిషాల పాటు ప్రతి అర గంటకి గ్యాప్ తీసుకుంటే మంచిది పైగా ఎక్కువసేపు కూర్చునే వాళ్ళు వ్యాయామంపై కూడా దృష్టి పెట్టాలి ఫిజికల్ యాక్టివిటీ తగ్గిపోవడం వలన టైప్ టు డయాబెటిస్ కార్డియో వాస్కులర్ సమస్యలు వంటివి కలుగుతాయి.
ఇది ఇలా ఉంటే హెల్త్ అండ్ సేఫ్టీ ఎగ్జిక్యూటివ్ యూకే గవర్నమెంట్ ఏజెన్సీ చేసిన స్టడీ ప్రకారం చూసుకున్నట్లయితే ఎక్కువసేపు కూర్చుని పని చేసే వాళ్లలో కార్డియో వాస్కులర్ సమస్యలు టైప్ టు డయాబెటిస్ డిప్రెషన్ కొలెన్ క్యాన్సర్ బ్రెస్ట్ క్యాన్సర్ ఊపిరితిత్తుల క్యాన్సర్ వంటివి సంభవించాయని తేలింది. అలానే మస్కిలోస్కెలిటల్ డిసాల్డర్స్ వంటివి కూడా చాలా మందిలో కలిగినట్లు గమనించారు అందుకని ఎక్కువసేపు అదే పనిగా కుర్చీలో కూర్చుని పని చేయడం మంచిది కాదు. ఎక్కువసేపు కూర్చుని పని చేయడం వలన నడుం నొప్పి వంటివి కూడా కలుగుతాయి కళ్ళకి కూడా మంచిది కాదు చేతులు కూడా నొప్పి కలుగుతాయి. ఏది ఏమైనప్పటికీ ఎక్కువసేపు కూర్చుని పని చేసేవాళ్ళు మధ్య మధ్యలో గ్యాప్ తీసుకోవాలి అలానే వ్యాయామం పైన ఆరోగ్యం పైన ప్రత్యేక దృష్టి పెట్టాలి.