ఇదేందీరా నాయనా.. పాములను కూడా ఆఖరికి వదలరా.. వీడియో..

-

ఫ్యాషన్ కోసం ఏదైనా చేసేలా ఉన్నారు నేటి యువత.. కొత్తగా చెయ్యాలని చెత్తగా చేస్తూ నెటిజన్ల విమర్శలు అందుకున్నారు..ట్రెండ్ కు తగ్గట్లు హెయిర్ స్టైల్ నుంచి.. చెప్పులు వరకు ప్రతీ విషయంలోనూ అందరి దృష్టిని ఆకర్షించేలా తమ ఆహార్యాన్ని మార్చుకుంటున్నారు. ఇందుకు నిదర్శనంగా నిలిచే ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. షూస్ నుంచి పొడుచుకుని వచ్చిన ఆ పాములను చూసి నెటిజన్లు తెగ భయపడిపోయారు.. కానీ దగ్గరకు వెళ్లి చూసి షాక్ అయ్యారు..

సోషల్ మీడియాలో నిత్యం ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతూ వస్తున్నాయి.. అందులో కొన్ని జనాలకు ఆశ్చర్యాన్ని కలిగిస్తే, మరికొన్ని కోపాన్ని కలిగిస్తున్నాయి.ఇప్పుడు అలాంటిదే ఒకటి నెట్టింట వైరల్ అవుతుంది.జంతువుల చర్మంతో తయారయ్యే వస్తువులు, చెప్పులు గురించి మీరు వినే ఉంటారు. అయితే ఇక్కడొక వ్యక్తి కొంచెం వెరైటీగా అలోచించాడు. ఏకంగా బూట్లను పాముల ఆకారంలో తీర్చిదిద్దాడు. అవి చూడటానికి అచ్చం పడగ విప్పిన పాములాగే ఉన్నాయి..

అవి చూడటానికి నిజమైన పాముల వలె ఉండటంతో అందుకు సంబంధించిన వీడియో ఇంటర్నెట్‌లో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ఈ బూట్లను వాడాలంటే.. చాలా ధైర్యం ఉండాలి బాసూ అని కొందరు కామెంట్ చేయగా.. మరికొందరేమో.. ఇదేందీరా నాయనా.. పాములను కూడా ఆఖరికి వదలరా..కామెంట్లు చేస్తున్నారు.. మొత్తానికి ఈ వార్త ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది.. ఇందుకు సంబందించిన కూడా చక్కర్లు కొడుతోంది.. ఇక ఆలస్యం ఎందుకు ఆ వీడియో పై ఒక లుక్ వేసుకోండి…

Read more RELATED
Recommended to you

Latest news