ఆ వైసీపీ నేత‌కు క‌ష్టాలే.. అన్ని దారులు మూసుకుపోయాయా..?

-

విజ‌య‌వాడ రాజ‌కీయాల్లో మంచి పేరు తెచ్చుకున్న కుటుంబం ఏదైనా ఉందంటే.. అది య‌ల‌మంచిలి ఫ్యామిలీనే. వివాద ర‌హితులుగా, పేద‌ల‌కు పెన్నిధిగా ప్ర‌జ‌ల‌కు ద‌గ్గ‌రైన కుటుంబం య‌ల‌మంచిలి ఫ్యామిలీ. య‌ల‌మంచిలి నాగేశ్వ‌ర‌రావు 1990ల‌లో విజ‌య‌వాడ‌లో చ‌క్రం తిప్పారు. టీడీపీలో మంచి నాయ‌కుడిగా ఎది గారు. అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల‌కు కూడా చేరువ‌య్యారు. ఏ స‌మ‌స్య‌లో ఉన్న‌వారు ఆయ‌న ఇంటి త‌లుపు త‌ట్టినా.. అది ఏవేళ అయినా.. నాగేశ్వ‌ర‌రావు నేనున్నానంటూ.. ప్ర‌జ‌ల‌కు వెన్నంటి ఉండేవారు. వారి స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించేవారు. ఆర్థికంగా కూడా సాయం చేసేవారు. అలాంటి నాయ‌కుడికి వార‌సుడిగా రంగంలోకి వ‌చ్చారు య‌ల‌మంచిలి ర‌వి.

ర‌వి కూడా నిబ‌ద్ధ‌త‌కు పెద్ద పీట వేశారు. త‌న తండ్రి వార‌స‌త్వాన్నినిల‌బెట్టారు. వివాదాల‌కు క‌డు దూరం గా ఉంటూ.. స‌మ‌స్య‌ల‌ను త‌న‌దైన శైలిలో ప‌రిష్క‌రిస్తూ.. అజాత శ‌త్రువుగా గుర్తింపు సాధించారు. అయితే, 2009 లో విజ‌య‌వాడ తూర్పు నియోజ‌క‌వ‌ర్గం టికెట్ కోసం ఆయ‌న అప్పుడే పార్టీ పెట్టిన చిరంజీవి ప్ర‌జారా జ్యంలో చేరిపోయారు. టికెట్ సంపాయించుకుని విజ‌యం సాధించారు. అయితే, త‌ర్వాత జ‌రిగిన రాజ కీయ స‌మీక‌రణ‌ల‌ను త‌న‌కు అనుకూలంగా మార్చుకోవ‌డంలో ర‌వి విఫ‌ల‌మ‌య్యార‌ని అంటారు ఆయ‌న అనుచ‌రులు. ప్ర‌జారాజ్యాన్ని కాంగ్రెస్‌లో విలీనం చేసినా.. ర‌వి త‌ట‌స్థంగా వ్య‌వ‌హ‌రించారు. దీంతో ఆయ న 2014లో ఏ పార్టీకీ మ‌ద్ద‌తిచ్చే ప‌రిస్థితి లేకుండా పోయింది.

ఆ త‌ర్వాత టీడీపీలో చేరినా.. ఆయ‌న‌కు పెద్ద‌గా ప్రాధాన్యం ల‌భించ‌లేదు. తూర్పు నియోజ‌క‌వ‌ర్గంలో సీని య‌ర్ టీడీపీ నేత గ‌ద్దె రామ్మోహ‌న్ హ‌వా ఉండ‌డం, దీనిని త‌ట్టుకుని త‌న స‌త్తా నిరూపించుకోవడంలోనూ ర‌వి విఫ‌ల‌మ‌య్యార‌నే వాద‌న ఉంది. పైగా లాబీయింగ్ చేసుకోవ‌డంలోనూ ర‌వి వెనుక‌బ‌డ్డారు. దీంతో ఆయ‌నకు ఈ ఏడాది 2019 ఎన్నిక‌ల్లో టికెట్ హామీ ల‌భించ‌లేదు. దీంతో ఎన్నిక‌ల‌కు ముందు ఆయ‌న వైసీపీలో చేరిపోయారు. నిజానికి టికెట్ కోస‌మే చేరినా.. చివ‌రి నిముషంలో ఆయ‌న‌కు టికెట్ ఊరించి ఉసూరుమ‌నిపించింది. దీంతో ఆయ‌న మౌనంగానే పార్టీలో ఉండిపోయారు.

వైసీపీఅధికారంలోకి వ‌చ్చాక త‌న‌కు న్యాయం జ‌ర‌గ‌క పోతుందా? అనుకున్నారు ర‌వి. అయితే, ఇప్ప‌టి వ‌ర‌కు ఆయ‌న ఊసు కానీ, పేరు కానీ పార్టీలో ఎక్క‌డా వినిపించ‌డం లేదు. పైగా నియోజ‌క‌వ‌ర్గంలో బొప్ప‌న భ‌వ‌కుమార్ ఓట‌మి నేప‌థ్యంలో త‌న‌ను వైసీపీ అధినేత జ‌గ‌న్ చేర‌దీస్తార‌ని ర‌వి పెట్టుకున్న ఆశ కూడా అడియాస అయింది. పార్టీలోనూ, నియోజ‌క‌వ‌ర్గంలోనూ ఆయ‌న క‌రివేపాకు అయిపోయార‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తోంది. నియోజ‌క‌వ‌ర్గం ఇంచార్జ్ పోస్టును ఇటీవ‌లే కండువా మార్చుకున్న దేవినేని అవినాష్ కొట్టేయ‌గా, న‌గ‌ర పార్టీ బాధ్య‌త‌ల‌ను బొప్ప‌న ద‌క్కించుకున్నారు. ఇక‌, ర‌వి కంటూ.. ఏమీ మిగ‌ల‌లేదు. దీంతో ఆయ‌న ఇప్పుడు దిక్కులు చూస్తున్నారు. మ‌రి ఫ్యూచ‌ర్‌లో ఆయ‌న ఎటు అడుగు వేస్తారు? మ‌ళ్లీ టీడీపీ తీర్థం పుచ్చుకుంటారా? లేక జ‌న‌సేన వైపు అడుగులు వేస్తారా? చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news