డిగ్రీ అర్హతతో సాఫ్ట్ వేర్ ఉద్యోగాలు..రూ.2 లక్షలు పైగా జీతం..పూర్తి వివరాలు..

-

డిగ్రీ పాస్ అయినవారికి గుడ్ న్యూస్..క్యాప్‌జెమినీ ఇంజినీరింగ్ సంస్థ ఆఫ్‌ క్యాంపస్‌ డ్రైవ్‌ ద్వారా నెట్‌ వర్క్‌ ఇంజినీర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఈ డ్రైవ్‌ ద్వారా 100 నెట్‌ వర్క్‌ ఇంజినీర్‌ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు..గతంలో కూడా ఈ కంపెనీ ఎన్నో ఉద్యోగాలను భర్తీ కోరుతూ నోటిఫికేషన్ ను విడుదల చేసింది.వాటికి మంచి స్పందన వచ్చింది.

క్యాప్‌జెమినీ ఒకటే కాదు ప్రముఖ ప్రైవేట్ కంపెనీలలో కూడా ఉద్యోగాల భర్తీకి ఇప్పటికే నోటిఫికేషన్ ను విడుదల చేశారు.. ఇటీవల విప్రో, కాగ్నిజెంట్ కంపెనీలు భారీ ఉద్యోగాలను విడుదల చేశారు.. క్యాప్‌జెమినీ కూడా గతంలో కొన్ని వేల ఉద్యోగాలను భర్తీ చేసింది. ఇప్పుడు మరో నోటిఫికేషన్ ను విడుదల చేసింది.. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..

ఈ ఉద్యోగాల పూర్తి వివరాలు..

మొత్తం ఖాళీలు: 100

అర్హత: ఏదైనా స్పెషలైజేషన్‌తో బీఎస్సీ/ బీసీఏ గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణత ఉండాలి.

అవసరమైన నైపుణ్యాలు:నెట్‌వర్కింగ్‌ టెక్నాలజీల్లో నాలెడ్జ్‌ ఉండాలి.
మంచి కమ్యూనికేషన్‌ నైపుణ్యాలతో పాటు డెమాన్‌స్ట్రేషన్‌ సామర్థ్యాలు ఉండాలి.

జీతం: ఏడాదికి రూ.2,75,000 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: ఆఫ్‌ క్యాంపస్‌ డ్రైవ్‌ (ఇంటర్వ్యూ) ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి..
జాబ్ లోకేషన్: ఇండియా మొత్తం

ఈ ఉద్యోగాలకు సంభందించిన పూర్తి సమాచారం కొరకు www.capgemini.com వెబ్ సైట్ లో చూడవచ్చు…ఇందులో పొందుపరిచిన నోటిఫికేషన్ను పూర్తిగా చదివి అప్లై చెయ్యగలరు..

Read more RELATED
Recommended to you

Latest news