వారెవ్వా..ఏమి స్టవ్ ఇది..గ్యాస్ తో పని లేకుండా వంట చేస్తుంది..

-

సాదారణంగా వంట చేసుకునే స్టవ్ లకు మంట రావాలంటే ఏదొక ఇంధనం ఉండాలి..లేకుంటే పని చెయ్యవు..కానీ ఓ గ్యాస్ కు ఎటువంటి అదనపు ఇంధనం అవసరం లేదు..కేవలం సోలార్ పవర్ ద్వారా మాత్రమే పని చేస్తుంది.. ఇప్పటివరకు విద్యుత్తు పరికరాలను చూసి ఉంటారు.అయితే అంతకు మించి ఈ స్టవ్ పని చేస్తుంది. ఇక ఆలస్యం ఎందుకు ఆ స్టవ్ పూర్తీ వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..

 

ఈ స్టౌవ్ ను ఎక్కడైనా , ఎప్పుడైనా అంటే ఏ సీజన్‌లోనైనా ఉపయోగించవచ్చు. ఈ స్టవ్‌కు సూర్య నూతన్ అని పేరు పెట్టారు. దీని ధర 12 వేల రూపాయల నుండి ప్రారంభమవుతుంది. అంటే ఒక ఏడాదికి ఖర్చు పెట్టే దాదాపు 12 సిలిండర్ల ఖర్చుతో సమానం.ఇండియన్ ఆయిల్ , R&D సెంటర్, ఫరీదాబాద్ డిజైన్ చేసి అభివృద్ధి చేసింది. ఇది సోలార్ కుక్కర్‌కి భిన్నంగా ఉంటుంది, ఈ స్టవ్ ను ప్రత్యేకంగా సూర్యరశ్మిలో ఉంచాల్సిన అవసరం లేదు , మీ కిచెన్ లో ఉంచుకొనే ఆహారాన్ని వండుకోవచ్చు..

ప్రీమియం మోడల్ నలుగురితో కూడిన కుటుంబానికి మూడు సార్లు అంటే అల్పాహారం, భోజనం , రాత్రి భోజనం కోసం పూర్తి భోజనాన్ని వండు కోవచ్చు. ఇది అన్ని రకాల వాతావరణంలో ఉపయోగించవచ్చు, అంటే శీతాకాలంలో లేదా వర్షాకాలంలో, ఆకాశంలో సూర్యకాంతి తక్కువగా ఉన్నప్పుడు కూడా ఎలాంటి సమస్య ఉండదు..ఒక ఇన్వర్టర్ లాగా కొంత ఎనెర్జిని స్టోర్ చేసి పెట్టుకుంటూంది. రీఛార్జ్ బ్యాటరీ ద్వారా పనిచేస్తుంది. అంటే మీరు రాత్రి పూట కూడా ఆహారాన్ని వండుకోవచ్చు.

సౌరశక్తితో, అలాగే ఛార్జింగ్ అనంతరం కూడా దీనిపై వంట చేసుకోవచ్చు..ఒక కేబుల్ ఉంది, దాని ఒక చివర ఇంటి కప్పుపై అమర్చిన సోలార్ ప్లేట్‌కు కనెక్ట్ చేసి ఉంటుంది , సోలార్ ప్లేట్ ద్వారా ఉత్పత్తి చేయబడిన శక్తి కేబుల్ ద్వారా స్టవ్‌లోకి చేరుతుంది. ఈ విధంగా సోలార్ ప్లేట్ థర్మల్ బ్యాటరీలో సౌర శక్తిని నిల్వ చేస్తుంది..నిజంగానే బాగుంది కదా.. గ్యాస్ ధరలు పెరిగిన,లీకెజ్ సమస్యలు ఉండవు.. మీకు నచ్చితే కొనండి..

Read more RELATED
Recommended to you

Latest news