బాలయ్య బసవతారకం హాస్పిటల్ కు అరుదైన గౌరవం.. ఏమిటంటే..!!

-

నందమూరి తారక రామారావు కొడుకుగా బాలకృష్ణ బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ను స్థాపించిన విషయం అందరికీ తెలిసిందే. ఎన్టీఆర్ భార్య బసవతారకం క్యాన్సర్ తో మరణించడంతో ఆమెకు చివరి కోరికగా ఈ క్యాన్సర్ హాస్పిటల్ ను స్థాపించి ఎంతోమంది నిరుపేద మధ్య దిగువ తరగతి వర్గాలకు క్యాన్సర్ చికిత్స అందిస్తున్నారు. బసవతారకం ట్రస్టు ద్వారా ఏర్పాటైన ఈ ఆసుపత్రికి చైర్మన్ గా నందమూరి బాలకృష్ణ వ్యవహరిస్తున్నారు. క్యాన్సర్ బారిన పడిన ఎంతోమంది చిన్న పిల్లలకు పెద్దలకు పునర్జన్మ ఇచ్చారు.

క్యాన్సర్ బాధితులకు అత్యున్నత ప్రమాణాలతో కూడిన వైద్యం అందిస్తూ ఉండటంతో హాస్పిటల్ కి దేశంలోనే బెస్ట్ క్యాన్సర్ హాస్పిటల్ గా రెండవ స్థానం లభించింది. తాజాగా ఈ హాస్పిటల్ 22 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. అందుకు సంబంధించి వేడుకలు కూడా చాలా ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ఖమ్మం ఎంపీ నాయ నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ ప్రజలకు సేవ చేసే ఇలాంటి హాస్పిటల్స్ ఉండడం వల్ల ప్రభుత్వం కూడా ఇలాంటి హాస్పిటల్ కు ఎప్పుడు సహకరిస్తూ ఉంటుందని తెలియజేశారు. అంతేకాకుండా హాస్పిటల్ మేనేజర్ కు కూడా శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ క్రమంలోనే హాస్పిటల్ చైర్మన్ నందమూరి బాలకృష్ణ సైతం హరీష్ రావు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. బాలయ్య చూడడానికి కరుకుగా ఉన్నా కూడా మనసు చాలా మెత్తనిదని తెలిపారు. అనంతరం బాలకృష్ణ మాట్లాడుతూ బసవతారకం హాస్పిటల్ సాధించిన విజయాలను కూడా వివరించారు. రెండు తెలుగు రాష్ట్రాలలో ఎంతోమంది ఆరోగ్యశ్రీ కింద ట్రీట్మెంట్ చేయించుకున్న హాస్పిటల్ లో గొప్ప పేరు పొందింది. మొదట వంద పడకల తో ప్రారంభమైన ఈ హాస్పిటల్ ప్రస్తుతం ఆరువందలకు పైగా పడకల హాస్పిటల్ గా రూపొందించడం జరిగిందని తెలిపారు. బెస్ట్ క్యాన్సర్ ట్రీట్మెంట్ హాస్పిటల్ లో రెండో స్థానం ఉండడం అంటే నిజంగా అటు చైర్మన్ బాలయ్య మాత్రమే కాదు మన తెలుగు ప్రజలకు ఇది ఒక గర్వకారణం అని తెలిపారు. ఇక బాలయ్య తన తల్లి చివరి కోరిక మేరకు ఎవరు క్యాన్సర్ తో చనిపోకూడదని బాలయ్య మొక్కుకొని సంకల్పంతో దీనిని నిర్వహించారని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news