చత్తీస్గడ్ రాజధాని రాయపూర్ లో మూడు రోజులపాటు నిర్వహిస్తున్న కాంగ్రెస్ పార్టీ 85వ ప్లీనరీలో రెండవ రోజైన శనివారం నాడు కాంగ్రెస్ ఎంపీ, యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ బిజెపి పై తీవ్ర విమర్శలు గుప్పించారు. దేశంలోని అన్ని సంస్థలను బిజెపి, ఆర్ఎస్ఎస్ నిర్వీర్యం చేస్తున్నాయని మండిపడ్డారు. దేశానికి, కాంగ్రెస్ పార్టీకి ఇది సవాళ్లతో కూడిన సమయం అన్నారు.
కొంతమంది వ్యాపారవేత్తలకు ప్రభుత్వం మద్దతు ఇవ్వడంతో దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బ తింటుందని అన్నారు. దేశ ప్రజలు సమానత్వం, సామరస్యం, సహనం కోసం ఎదురుచూస్తున్నారని భారత్ జోడో యాత్రలో తెలిసిందన్నారు. డాక్టర్ మన్మోహన్ సింగ్ నాయకత్వంలో 2004, 2009లో సాధించిన విజయాలు తనకు ఎంతో సంతృప్తినిచ్చాయని, కాంగ్రెస్ పార్టీని మలుపు తిప్పిన భారత్ జోడో యాత్రతో ఇన్నింగ్స్ ముగించాలనుకోవడం సంతోషాన్ని ఇస్తుందని చెప్పారు.