కరోనా విలయంలో ప్రజలకు ఎవరైనా ముందుగా గుర్తొస్తున్నారంటే అది సోనూసూద్ మాత్రమే. ఆపదొస్తే ఆ పేరునే తలుచుకుంటున్నారు. బహుశా మంచికి మరోపేరు ఏదైనా ఉందంటే అది సోనూసూద్ అనే చెప్పాలేమో. ఈ రియల్ హీరో ఇప్పటి వరకు వ్యక్తులకు, సెలబ్రిటీలకు మాత్రమే సాయం చేసేవాడు. కానీ ఈసారి ఏకంగా ప్రభుత్వానికి సాయం చేశాడు.
ఇప్పటికే దేశ వ్యాప్తంగా ఆక్సిజన్ సప్లయ్‌చేస్తూ ప్రశంసలు అందుకుంటున్నాడు. దేశంలో ఆక్సిజన్ కొరత రాకుండా ఉండేందుకు ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నాడు.
ఇప్పుడు ఏపీలోని నెల్లూలో ఆక్సిజన్ జనరేటర్ లేక పేషెంట్లు ఇబ్బంది పడుతున్నారు. దీంతో ఆదుకోవాలంటూ కలెక్టర్ సోనూసూద్‌కు లేఖ రాశారు. వెంటనే స్పందించిన సోనూసూద్ రెండు రోజుల్లోగా ఆక్సిజన్ జనరేటర్‌ను అందించారు. దీంతో తెలుగు ప్రజలు ఆయన్ను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ఎంతైనా సోనూ గ్రేట్ కదా.