చిన్న బంగాళదుంపలతో నోరూరించే స్నాక్స్ తయారు చేసుకోండిలా..

-

ప్రపంచ దేశాల్లో అత్యధికంగా పండే పంట గురించి చెప్పాల్సి వస్తే అది బంగాళదుంపే అయ్యుంటుంది. ఇక్కడా అక్కడా అని కాకుండా ప్రతీచోటా పండే ఈ బంగాళదుంపలతో రకరకాల వెరైటీలు తయారు చేసుకోవచ్చు. కుర్మా, ఫ్రై, బంగాళ దుంప కూర, బేకింగ్ చేసి మరో విధమైన వెరైటీ.. ఇలా చెప్పుకుంటూ పోతే రకరకాలుగా తయారుచేసుకోవచ్చు. ప్రస్తుతం చిన్న బంగాళదుంపలతో ఒకానొక వెరైటీ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. వీటిని సైడ్ డిష్ లాగా ఆరగించవచ్చు.

దీనికోసం కావాల్సిన పదార్థాలు

పావుకిలో బంగాళదుంపలు (చిన్నవి)

1టేబుల్ స్పూన్ వెన్న లేదా అంతకన్నా ఎక్కువ
కొన్ని రోజ్ మేరీ ఆకులు
రుచికోసం తగినంత ఉప్పు
నల్లమిరియాలు ( దంచినవి)
1టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్
కొంత నిమ్మరసం
3వివిధ రకాలైన క్యాప్సికమ్

ఒక పాత్రలో చిన్న బంగాళ దుంపలని తీసుకుని వాటిని ముక్కలుగా కాకుండా ముద్ద వంకాయలని కోసిన మాదిరిగా కోసుకోవాలి.

వాటికి వెన్న, నెయ్యి, రోజ్ మేరీ ఆకులతో దంచిన నల్ల మిరియాల పొడిలో ముంచాలి.

పెనం తీసుకుని అందులో ఆలివ్ ఆయిల్ వేసి వేడి అయ్యేవరకు పొయ్యి మీద ఉంచాలి. ఆ తర్వాత కొన్ని మిరపకాయలతో పాటు రాక్ సాల్ట్ వేసి బంగాళదుంపలని పెనంలో వేయాలి.

అది అలా పెనం మీద వేడి అవుతూ ఉండాలి. బంగాళ దుంపలు కరకరలాడేలా తయారయ్యే వరకు ఏమీ అనకూడదు. ఆ తర్వాత కొన్ని రోజ్ మేరీ ఆకులని అందులో వేయాలి. ఇప్పుడు బంగాళ దుంపలని వేరే పాత్రలోకి తీసుకోవాలి.

ఇప్పుడు క్యాప్సికమ్ తీసుకుని ఒక పాత్రలో వేయించాలి. అందులో మిరియాలని వేయాలి. కొద్దిగా వేగిన తర్వాత పక్కన ఉంచుకోవాలి.

ఇప్పుడు బంగాళదుంపలని, క్యాప్సికమ్ ని ఒకే పాత్రలోకి తీసుకోండి. బాగా కనిపించేందుకు వాటిపైన కొత్తిమీర కలుపుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news