టీమ్ ఇండియా స్టార్​ బ్యాటర్​కు బాలీవుడ్ బ్యూటీ ప్రేమ సందేశం

-

భారత్-ఆస్ట్రేలియాల మధ్య మొదటి టీ-20 మ్యాచ్ మంగళవారం జరిగింది. ఈ మ్యాచ్​లో మొదట తడబడిన ఇండియా ప్లేయర్స్ ఆఖరి ఓవర్లలో వీరోచితంగా విరుచుకుపడ్డారు. అయినా సొంత తప్పదాలతో చివరకు ఓటమి పాలయ్యారు. ఈ మ్యాచ్ ఇండియాకు ఏ మాత్రం కలిసి రాలేదు. కానీ ఓ ఇండియన్ స్టార్ బ్యాటర్​కు మాత్రం ఓటమి కూడా బాగా కలిసొచ్చింది. ఇంతకీ ఆ బ్యాటర్ ఎవరు..? అతడికి ఏం కలిసొచ్చింది అంటే..?

భారత్-ఆస్ట్రేలియా టీ-20 మ్యాచ్​లో మంగళవారం రోజున ఓపెనర్ కేఎల్ రాహుల్ ప్రదర్శనకు అతడి ప్రేయసి ఫిదా అయింది. ఇండియాకు కలిసి రాని ఈ మ్యాచ్​ రాహుల్​కు మాత్రం బాగా కలిసొచ్చింది. ఈ మ్యాచ్​లో రాహుల్ పర్ఫామెన్స్​ను మెచ్చిన అతడి లవర్, బాలీవుడ్ బ్యూటీ అతియా శెట్టి ఇన్​స్టాగ్రామ్​లో ఓ పోస్టు పెట్టింది.

మైదానంలో బ్యాట్​తో ఫుల్ రాక్ చేస్తున్న రాహుల్ ఫొటో పెట్టి దానికి లవ్ ఎమోజీని జతచేసింది. ఈ పోస్టును చూసిన నెటిజన్లు, రాహుల్, అతియా ఫ్యాన్స్ తెగ సంబురపడిపోతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news