నిన్న ఖింఖానా గ్రౌండ్స్ దగ్గర జరిగిన సంఘటనపై Hca ప్రెసిడెంట్ అజారుద్దీన్ స్పందించారు. చాలా రోజుల తర్వాత హైదరాబాద్‌లో క్రికెట్ మ్యాచ్ జరుగుతుండటంతో టిక్కెట్లకు డిమాండ్ ఏర్పడిందని మీడియాకు తెలిపారు. మేము టిక్కెట్లు బ్లాక్ చేయలేదు.. బ్లాక్‌లో అమ్మలేదన్నారు.
జింఖానా దగ్గర ఏం జరిగిందో పోలీసులకు తెలుసు.. గాయపడిన వారికి అండగా ఉంటామని చెప్పారు. 11,450 టిక్కెట్లను ఆన్‌లైన్‌లో అమ్మామన్నారు అజారుద్దీన్. మ్యాచ్ టికెట్స్ అమ్మకాలపై HCA కు ఎలాంటి సంబంధం లేదు…మేము Paytm కు అమ్మకాల భాధ్యత ఇచ్చామని వివరించారు. తెలంగాణ పోలీస్ లు మాపై కేసులు పెడితే…మేము Paytm పై కేసు పెడతామని వార్నింగ్ ఇచ్చారు. జింఖానా లో జరిగిన తొక్కిసలాట కు Hca కు సంబంధం లేదని.. Hca ప్రెసిడెంట్ అజారుద్దీన్ వివరించారు.