చెన్నై సూపర్ కింగ్స్‌కు షాక్.. స్టార్ ఆల్‌రౌండర్ దూరం !

-

ఐపీఎల్ ఫ్రాంఛైజీ చెన్నై సూపర్ కింగ్స్ తో పాటు టీం ఇండియాకు బిగ్ షాక్ తగిలింది. స్టార్ ఆల్రౌండర్ దీపక్ చాహర్ తొడ కండరాల గాయానికి గురయ్యారు. వెస్టిండీస్ జట్టుతో ఆదివారం జరిగిన మూడో టి20 మ్యాచ్ లో అద్భుత బౌలింగ్ తో రెండు వికెట్లు తీసిన దీపక్.. ఆ తర్వాత తొడ కండరాలు పట్టేయడం తో మైదానం వీడాడు.

ఇన్నింగ్స్ ఫస్ట్ ఓవర్ లోని విండీస్ ఓపెనర్ మేయర్స్ ను కీపర్ క్యాచ్ గా పెవిలియన్ చేర్చినా దీపక్.. తన మరుసటి ఓవర్లోనే హో కూడా అదే తరహాలో అవుట్ చేశాడు. అయితే ఆ ఓవర్ ఐదో బంతి వేసే క్రమంలో తొడ కండరాల గాయానికి దీపక్ గురయ్యాడు. వెంటనే ఫిజియో వచ్చి పరిశీలించి… బయటికి తీసుకెళ్లాడు. దీంతో ఆ ఓవర్ చివరి బంతి వెంకటేష్ అయ్యర్ వేశాడు. ఇక తదుపరి మ్యాచులకు దీపక అవుతాడా లేదా అనేది తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news