క్రిస్‌ గేల్ వచ్చేస్తున్నాడు.. ఎప్పుడో తెలుసా?

IPL మొత్తం జట్లను పరిశీలించినట్లయితే అన్నింటి కంటే, పంజాబ్ జట్టు మంచి ఫామ్ లో ఉందని తెలుస్తోంది. నిన్న గురువారం నాడు బెంగళూరు జట్టును వీరు చాలా చిత్తుగా ఓడించారు. ప్రస్తుతం పంజాబ్‌ జట్టు పాయింట్ల పట్టికలో మొదటి స్థానంలో ఉండటం కొసమెరుపు. అయితే ఈ టీమ్‌లో కీలక భాగస్వామి అయిన క్రిస్‌గేల్‌ను మొదటి 2 మ్యాచ్‌లలో ఆడించని సంగతి అందరికీ తెలిసినదే. అయితే ఈ విధ్వంసకారుడి ఆట చూసేందుకు అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

మైదానంలో గేల్‌ గేల్‌ అంటూ.. నినాదాలు చేస్తూ, ఎంట్రీ ఎప్పుడని అడుగుతున్నారు. గురువారం బెంగళూరుతో అట స్టార్ట్ అవ్వక మునుపే సారథి రాహుల్‌ను ఇదే ప్రశ్న అడగ్గా, అతడు ఆసక్తికరంగా స్పందించాడు. గేల్ సరైన సమయంలో, అవసరం వచ్చినపుడు తప్పక వస్తాడంటూ బదులిచ్చాడు. ఇంకా ఆయన మాట్లాడుతూ.. ‌గేల్ ఆటను చూసేందుకు నేను కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని చెప్పుకొచ్చాడు.