గుర్తుకొస్తున్నాయి.. యువీ 6 బంతుల్లో కొట్టిన 6 సిక్సర్లు.. వీడియో..!

-

2007వ సంవత్సరంలో జరిగిన ఐసీసీ టీ20 వరల్డ్ కప్‌లో భారత్ ఘన విజయం సాధించిన విషయం విదితమే. ఆ టోర్నీలో భారత్ రెండు చిరస్మరణీయ విజయాలను న‌మోదు చేసింది.

అంతర్జాతీయ క్రికెట్‌లో మరొక క్రికెటర్ శకం ముగిసింది. భారత క్రికెటర్ యువరాజ్ సింగ్ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. తాను అన్ని ఫార్మాట్లకు చెందిన క్రికెట్ నుంచి రిటైర్ అవుతున్నానని యువీ ఇవాళ ప్రకటించాడు. దీంతో క్రికెట్ అభిమానులు యువీని మిస్ అవుతున్నామంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అతనికి వీడ్కోలు మెసేజ్‌లు పెడుతున్నారు. ఇక కొందరైతే యువీ అప్పట్లో బాదిన 6 బంతులకు 6 సిక్సుల వీడియోలను షేర్ చేస్తూ యువీని గుర్తు చేసుకుంటున్నారు.

2007వ సంవత్సరంలో జరిగిన ఐసీసీ టీ20 వరల్డ్ కప్‌లో భారత్ ఘన విజయం సాధించిన విషయం విదితమే. ఆ టోర్నీలో భారత్ రెండు చిరస్మరణీయ విజయాలను న‌మోదు చేసింది. ఒకటి ఇంగ్లండ్‌పై.. మరొకటి ఫైనల్లో పాకిస్థాన్‌పై.. ఇంగ్లండ్‌పై జరిగిన మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించగా.. ఆ మ్యాచ్‌లో యువీ 6 బంతులకు 6 సిక్సులను బాది హీరో అయ్యాడు.

2007 ఐసీసీ టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో యువీ ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ ఆండ్రూ ఫ్లింటాఫ్‌తో గొడవ పడ్డాడు. మొదటగా స్టెడ్జింగ్‌ను ప్రారంభించిన ఫ్లింటాఫ్ యువీని రెచ్చగొట్టాడు. ఈ సమయంలో ఇంగ్లండ్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్‌కు దిగగా.. అతని బౌలింగ్‌లో యువీ 6 బంతులకు 6 సిక్సర్లను బాది అదరహో అనిపించాడు. ఈ క్రమంలో వరల్డ్ కప్ అనంతరం యువీకి బీసీసీఐ భారీ నజరానాతోపాటు ఓ లగ్జరీ కారును కూడా బహుమతిగా ఇచ్చింది. అయితే ఆ మ్యాచ్‌లో యువీ కొట్టిన 6 సిక్సర్లను ఇప్పటికీ అభిమానులు మరిచిపోలేదు. అందుకనే ఇవాళ యువీ రిటైర్మెంట్ ప్రకటించగానే ఆ సిక్సులను తలచుకుంటూ మరోసారి ఆ వీడియోను వైరల్ చేస్తున్నారు. కావాలంటే మీరు ఓ సారి ఆ వీడియోపై లుక్కేయండి..!

Read more RELATED
Recommended to you

Latest news