ఏపీకి గవర్నర్‌గా మాజీ కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ అయితే బాగుంటుందని మోదీ భావిస్తున్నారట. అందుకనే ఆమె ఇప్పుడు ఏపీకి గవర్నర్ అవుతారనే వార్తలు జోరుగా ప్రచారం అవుతున్నాయి.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌గా ఉన్నప్పటి నుంచే నరసింహన్ గవర్నర్‌గా కొనసాగుతున్న విషయం విదితమే. ఈ క్రమంలో తెలంగాణ, ఏపీలు రెండు రాష్ట్రాలుగా విడిపోయాక రెండు రాష్ట్రాలకూ నరసింహనే గవర్నర్‌గా కొనసాగుతూ వస్తున్నారు. అయితే తెలంగాణ సీఎం కేసీఆర్ కు మాత్రమే గవర్నర్ సపోర్ట్ చేస్తున్నారని అప్పట్లో సీఎం చంద్రబాబు ఆరోపించారు. ఆ తరువాత ఇప్పుడు ఏపీలో ప్రభుత్వం మారింది. జగన్ సీఎం అయ్యారు. అయితే ఇప్పుడు ఏపీకి గవర్నర్‌గా నరసింహన్‌ను తప్పించి కొత్త వారిని ఎంపిక చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నదట.
కాగా ఏపీకి గవర్నర్‌గా మాజీ కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ అయితే బాగుంటుందని మోదీ భావిస్తున్నారట. అందుకనే ఆమె ఇప్పుడు ఏపీకి గవర్నర్ అవుతారనే వార్తలు జోరుగా ప్రచారం అవుతున్నాయి. సుష్మా స్వరాజ్ గత 5 సంవత్సరాల పాటు మోదీ కేబినెట్‌లో విదేశాంగ శాఖ మంత్రిగా ఉండి తన బాధ్యతలను చాలా చక్కగా నిర్వర్తించారు. విదేశాల్లో చిక్కుకుపోయిన ఎంతో మందిని భారత్‌కు రప్పించడంలో ఆమె చాకచక్యంగా వ్యవహరించారు. అయితే ఈ సారి మాత్రం ఆమె ఎన్నికల్లో పోటీ చేయలేదు. అందుకు కారణాలను కూడా ఆమె వెల్లడించలేదు.
అయితే తాను ఎంపీగా పోటీ చేయనని, ఎలాంటి పదవులు చేపట్టనని సుష్మా స్వరాజ్ చెప్పినప్పటికీ ఆమె ప్రజలకు చేసిన సేవలకు, పార్టీకి అందించిన సేవలకు గాను మోదీ ఆమెకు సముచిత పదవి ఇచ్చి గౌరవించాలని చూస్తున్నారట. అందుకనే ఆమెను ఏపీకి గవర్నర్‌గా నియమించే అవకాశం ఉన్నట్లు తెలిసింది. అయితే ఈ నిర్ణయంపై త్వరలో స్పష్టత రానుండగా.. ఒక వేళ సుష్మా నిజంగానే ఏపీ గవర్నర్ అయితే ఆమె ఇక్కడ ఎలా బాధ్యతలు నిర్వర్తిస్తారో వేచి చూస్తే తెలుస్తుంది..!