కరోనా వైరస్ నేపథ్యంలో కొన్ని నెలల పాటు క్రికెట్‌కు అంతరాయం ఏర్పడింది. అయితే ఎట్టకేలకు సెప్టెంబర్ నుంచి నవంబర్ వరకు ఇండియన్ ప్రీమియర్ లీగ్ జరగడంతో భారత క్రికెట్ అభిమానులు మళ్లీ క్రికెట్‌ను ఆస్వాదించడం మొదలు పెట్టారు. ఈ క్రమంలోనే భారత్ ఆస్ట్రేలియా సిరీస్‌కు వెళ్లింది. ప్రస్తుతం ఇంగ్లండ్‌తో స్వదేశంలో సిరీస్ లు ఆడుతోంది. అయితే రానున్న రెండేళ్ల కాలానికి గాను.. అంటే.. 2021 నుంచి 2023 వరకు భారత క్రికెట్ జట్టు ఆడనున్న సిరీస్‌లు, టోర్నమెంట్‌ల వివరాలను బీసీసీఐ విడుదల చేసింది.
2021 నుంచి 2023 వరకు భారత్ రెండేళ్ల కాలంలో 3 వరల్డ్ కప్‌లు ఆడనుంది. వాటిల్లో 2 టీ20, 1 వన్డే వరల్డ్ కప్, పలు ద్వైపాక్షిక సిరీస్‌లు ఉన్నాయి.
2021 ఏప్రిల్ – మే – ఇండియన్ ప్రీమియర్ లీగ్
2021 జూన్ నుంచి జూలై – వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్, ఇండియా వర్సెస్ శ్రీలంక (3 వన్డేలు, 5 టీ20లు), ఆసియా కప్
జూలై 2021 – ఇండియా వర్సెస్ జింబాబ్వే (3 వన్డేలు)
జూలై నుంచి సెప్టెంబర్ 2021 – ఇండియా వర్సెస్ ఇంగ్లండ్ (5 టెస్ట్‌లు)
అక్టోబర్ 2021 – ఇండియా వర్సెస్ సౌతాఫ్రికా (3 వన్డేలు, 5 టీ20లు)
అక్టోబర్ నుంచి నవంబర్ 2021 – ఐసీసీ టీ20 వరల్డ్ కప్
నవంబర్ నుంచి డిసెంబర్ 2021 – ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ (2 టెస్టులు, 3 టీ20లు), ఇండియా వర్సెస్ సౌతాఫ్రికా (3 టెస్టులు, 3 టీ20లు)
2022లో టీమిండియా షెడ్యూల్…
జనవరి నుంచి మార్చి 2022 వరకు – ఇండియా వర్సెస్ వెస్టిండీస్ (3 వన్డేలు, 3 టీ20లు), ఇండియా వర్సెస్ శ్రీలంక (3 టెస్టులు, 3 టీ20లు)
ఏప్రిల్ నుంచి మే 2022 వరకు – ఇండియన్ ప్రీమియర్ లీగ్
జూన్ 2022 – సిరీస్ లు ఏమీ ప్లాన్ చేయలేదు
జూలై నుంచి ఆగస్టు 2022 వరకు – ఇండియా వర్సెస్ ఇంగ్లండ్ (3 వన్డేలు, 3 టీ20లు), ఇండియా వర్సెస్ వెస్టిండీస్ (3 వన్డేలు, 3 టీ20లు)
సెప్టెంబర్ 2022 – ఆసియా కప్ (వెన్యూ నిర్దారించలేదు)
అక్టోబర్ నుంచి నవంబర్ 2022 – ఐసీసీ వరల్డ్ టీ20 (ఆస్ట్రేలియా)
నవంబర్ నుంచి డిసెంబర్ 2022 – ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ (2 టెస్టులు, 3 టీ20లు), ఇండియా వర్సెస్ శ్రీలంక (5 వన్డేలు)
2023లో టీమిండియా షెడ్యూల్…
జనవరి – ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ (3 వన్డేలు, 3 టీ20లు)
ఫిబ్రవరి నుంచి మార్చి – ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా (4 టెస్టులు, 3 వన్డేలు, 3 టీ20లు)
ఏప్రిల్ నుంచి మే – ఇండియన్ ప్రీమియర్ లీగ్
అక్టోబర్ – వన్డే వరల్డ్ కప్