క్రికెట్ కేవలం డబ్బుకు సంబంధించింది మాత్రమే కాదు: సౌరవ్ గంగూలీ

-

క్రికెట్ అనేది కేవలం డబ్బు గురించి మాత్రమే కాదని అన్నారు బిసిసిఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ. ఐపీఎల్ లో రాబోయే ఐదేళ్ల కాలానికి మీడియా హక్కుల అమ్మకం ద్వారా భారీ ఆదాయం రావడంపై గంగూలి హర్షం వ్యక్తం చేశారు.” క్రికెట్ ఎప్పుడూ డబ్బుకు సంబంధించినది కాదు.. ఇది ప్రతిభకు సంబంధించినది. మన దేశంలో క్రికెట్ ఎంత బలంగా ఉందో మీడియా హక్కుల వేలంలోనే తేలింది. యువ ఆటగాళ్లు అందరికీ వారి సామర్థ్యాన్ని అత్యున్నత స్థాయికి, టీమిండియాను ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లడానికి.. వేలంలో పలికిన భారీ ధరలు అతిపెద్ద ప్రేరణగా ఉండాలి.

ప్రపంచంలోని అత్యుత్తమ ఆటగాళ్లను తీర్చిదిద్దేందుకు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పిస్తాం. మన దేశంలో క్రికెట్ ఒక మతం. గత యాభై ఏళ్లలో ఆటకు ఆదరణ తీసుకువచ్చిన ఆటగాళ్లకు, నిర్వాహకులకు అభినందనలు. అలాగే క్రికెట్ కు అంతగా ఆదరణ లేనప్పుడు పెద్ద సంఖ్యలో స్టేడియాలకు వెళ్లి, టీవీల ముందు కూర్చొని మ్యాచులు వీక్షించిన అభిమానులకు, మద్దతుదారులకు నా ప్రత్యేక శుభాకాంక్షలు” అని అన్నారు దాదా.

Read more RELATED
Recommended to you

Latest news