టీమిండియా, ఇంగ్లాండ్ మధ్య గతంలో కరోనా కారణంగా నిలిచిపోయిన 5వ టెస్టును మళ్లీ నిర్వహిస్తున్నారు. ఎడ్జ్ బాస్టన్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ కు వరుణుడు అంతరాయం కలిగించాడు. తొలిరోజు ఆట ప్రారంభమైన కాసేపటికే వర్షం కురవడంతో మ్యాచ్ నిలిచిపోయింది. వర్షం జోరుగా కురియడంతో ఆటగాళ్ళు మైదానాన్ని వీడారు. ఇంగ్లాండ్ టాస్ గెలిచి మొదట బౌలింగ్ ఎంచుకోవడంతో బ్యాటింగ్ కు దిగిన భారత్ వర్షం కురిసే సమయానికి తొలి ఇన్నింగ్స్ లో రెండు వికెట్ల నష్టానికి 53 పరుగులు చేసింది.
హనుమ విహారి 14, విరాట్ కోహ్లీ 1 పరుగుతో ఆడుతున్నారు. కాగా 27 పరుగుల వద్ద ఓపెనర్ శుభమన్ గిల్(17) తొలి వికెట్ ను కోల్పోయింది. ఆ తర్వాత కొద్ది సేపటికి మరో ఓపెనర్ చటేశ్వర్ పుజారా(13) కూడా అవుట్ కావడంతో టీమ్ ఇండియా రెండో వికెట్ చేజార్చుకుంది. కాగా ఈ రెండు వికెట్లు జేమ్స్ అండర్సన్ ఖాతాలో చేరాయి. అయితే వర్షం ఆగకపోవడంతో అంపైర్లు ముందుగానే లంచ్ విరామం ప్రకటించేశారు.
UPDATE – It has started to rain here at the Edgbaston Stadium.#ENGvIND
— BCCI (@BCCI) July 1, 2022